https://oktelugu.com/

Hair Fall :  జుట్టు రాలుతుందా? ప్రతిరోజూ ఉదయం ఇలా చేస్తే సమస్య మాయం..

మనషుల్లో ఆడ, మగ ఎవరికైనా నెత్తిన జుట్టు ఉంటేనే అందంగా కనిపిస్తారు. కానీ కొందరికి వయసు పైబడకముందే జుట్టు రాలిపోతుంటుంది. మరికొందరికి తొందరగా బట్టతల వస్తుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పని చేస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2024 / 01:29 AM IST

    Hair fall

    Follow us on

    Hair Fall :  వాహనాల నుంచి వెలువడే పొల్యూషన్, ప్యాక్టరీల నుంచి వచ్చే పొగ కారణంగా వాతావరణం కలుషితం అవుతోంది. దీంతో స్వచ్ఛమైన గాలి, నీరు నేచురల్ ను కోల్పోతున్నాయి. కాలుష్యమైన గాలితో పాటు నీటిని సేవించడం వల్ల మనుషులు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీంతో శరీరంలోని భాగాలు మాత్రమే కాకుండా బయట ఉన్న అవయవాలు దెబ్బతింటున్నాయి. మనషుల్లో ఆడ, మగ ఎవరికైనా నెత్తిన జుట్టు ఉంటేనే అందంగా కనిపిస్తారు. కానీ కొందరికి వయసు పైబడకముందే జుట్టు రాలిపోతుంటుంది. మరికొందరికి తొందరగా బట్టతల వస్తుంది. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పని చేస్తే జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

    జుట్టు రాలడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం. విటమిన్ బి 12, విటమిన్ డి , విటమిన్ ఏ, విటమిన్ ఈ లోపం కారణంగా జుట్టు ఊడిపోతుంది. అంతేకాకుండా చాలా మంది ఒత్తిడితో ఉంటున్నారు. ఇలాంటి వారికి కూడా జుట్టు తొందరగా ఊడిపోతుంది. పోషకాహార లోపం మరో కారణంగా ఉంటుంది. ఇంకొందరు జుట్టు అందంగా ఉండాలని రకరకాల క్రీములు వాడుతూ ఉంటారు. వీటి వల్ల జుట్టు దెబ్బతిని తొందరగా ఊడిపోతుంది. చాలా మంది అతిగా తల స్నానం చేస్తారు. వీరిలోనూ జుట్టు సమస్యలు ఏర్పడుతాయి.

    అయితే జుట్టు రాలకుండా ఉండడాని మెడిసిన్ వాడుతూ ఉంటారు. అయితే ఇంట్లోని ఈ చిన్న పని చేయడం వల్ల జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జోట్టు రాలుతుందని గ్రహించిన వారు.. రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీళ్లు ఉంచాలి. ఉదయాన్నే లేచి ఆ రాగి పాత్రలోని నీరు తాగాలి. ఇలా వారం రోజుల పాటు తాగడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చు. రాగి పాత్రలో నీరు కాలుష్యరహిత కారకంగా పనిచేస్తాయి. ఇందులో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు తీసుకోవడం వల్ల శరీరానికి ఇనుము అందుతుంది. దీంతో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పెరగడానికి తోడ్పడుతాయి. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల జుట్టు మాత్రమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

    రాగి పాత్రలో ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు లీటర్ల వరకు నీరు తాగడం మరీ మంచిది. అయితే ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉంటుంది. అన్ని నీళ్లను ఒకేసారి కాకుండా మెల్లగా నీటిని మొత్తాన్ని తాగాలి. ఈ నీరు శరీరంలోకి వెళ్లి జుట్టును అందించే కణాలను బలపరుస్తుంది. దీంతో జుట్టు రాలకుండా ఆపుతుంది. ఇవే కాకుండా ఎక్కువగా షాంపులు, క్రీములు వాడకుండా ఉండాలి. నేచరల్ గా లభించే వాడిని వాడొచ్చని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. విటమిన్ ఎక్కువగా లభించే కొన్ని పదార్థాలను జుట్టుకు వేయొచ్చని చెబుతున్నారు. కాలుష్యం ప్రదేశాల్లో విధులు నిర్వహించాల్సి వస్తే సరైన రక్షణ చర్యలు చేపట్టాలి.