Vasthu Tips : మానవ మనుగడకు చెట్లు చాలా అవసరం. పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చెట్టు ఉన్న చోట ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది.ప్రస్తుతం కాలంలో ఆధునీకీకరణ పేరుతో చెట్లను నరికివేస్తున్నారు. కాని ప్రత్యేక సందర్భాల్లో ఒక మొక్కను నాటాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే చెట్లు పెంచడం మంచిదే. కానీ ఇంట్లో కొన్ని చెట్లు ఉండడం అంత మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇంటిని వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటాం. ఇదే సమయంలో ఇంట్లో చెట్లు పెంచొచ్చా? లేదా? అనేది కూడా తెలుసుకుంటాం. ఏ ఇంట్లోనైనా పూల చెట్లు, పండ్ల చెట్టు కనిపిస్తాయి. కానీ ఈ చెట్టు మాత్రం కనిపించదు. అంతేకుండా ఈ చెట్టు ఇంట్లో పెరగడం ప్రారంభమైతే ఒక సంకేతం ఇచ్చినట్లేనని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. అదేంటంటే?
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు ఇంట్లో అస్సలు పెంచుకోకూడదు. వాటిలో రావి చెట్టు ఒకటి. దీనినే పీపల్ అనికూడా అంటారు. పీపల్ చెట్లు ఎక్కువగా వివిధ ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి దేవాలయాల్లో కచ్చితంగా ఉంటాయి. ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా రావి చెట్టును దేవుళ్ల చెట్టుగా భావిస్తాం. కానీ దీనిని ఇంట్లో పెంచుకోవడం అంతమంచిది కాదని అంటున్నారు.
రావి చెట్లు ఇంట్లో ఉండడం అశుభాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ఈ చెట్టు వల్ల ఆ ఇంటికి ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని గ్రంథాల ప్రకారం ఇది ఇంట్లో ఉండడం వల్ల సంక్షోభంతో పాటు నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయి. కటుంబ ఎదుగుదలను ఇది నిరోధిస్తుంది. చిన్న పిల్లలు ఎక్కువగా సమస్యలో పడుతారు. కటుంబ అభివృద్ధిని అడ్డుకుంటుంది. రావి చెట్టు భారీ ఎత్తులో పెరుగుతంది. దీని వేర్లతో ఇంటి పగుళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల రావి చెట్టును పొరపాటున కూడా ఇంట్లో పెంచుకోవద్దని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే అనుకోకుండా ఇంట్లో రావి చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఇలా పెరిగినప్పుడు దానిని తీసేసి అడవిలో నాటాలి. ఇలా రావి చెట్టు పెరుగుతున్నా.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంటి పూర్వీకులు కుటుంబ సభ్యులపై కోపంతో ఉండడం వల్ల ఇలా పెరుగుతుందని అంటారు. ఇది చిన్నగా పెరిగినప్పుడే దానిని తీసి ఇతర చోట నాటాలి. దీనిని తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో దోషాలు పెరుగుతాయి. ఇక కొన్ని ఇళ్లల్లో పగుళ్లు ఉన్న చోట ఈ చెట్టు పెరుగుతుంది.
అయితే దేవాలయాల్లోని రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని కొందరు చెబుతున్నారు. ఈ చెట్టుపై లక్ష్మీ దేవత ఉంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. ప్రతి శనివారం రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. అలాగే ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోతాయని అంటారు.