Junk Food: జంక్ ఫుడ్ తిన్నప్పుడు కూల్ వాటర్ తాగారా? అయితే ప్రమాదంలో పడినట్లే..?

నేటి కాలంలో చాలా మంది వేసవి బాధ నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్ లను కొనుక్కుంటున్నారు. కొన్ని షోరూంలు సైతం తక్కువ ధరకు ఆఫర్లపై ఇస్తుండడంతో నిత్యవసరాల్లో ఫ్రిజ్ తప్పనిసరి అయింది.

Written By: Srinivas, Updated On : August 28, 2023 2:32 pm

Junk Food

Follow us on

Junk Food: మానవ శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది తక్కువైనప్పుడల్లా దాహం వేస్తుంది. కొందరు క్రమ పద్ధతిలో నీరును తీసుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం నిర్లక్ష్యం చేస్తారు. ఇలా నిర్లక్ష్యం చేసిన వారు అనేక రకాల అనారోగ్యానికి గురయ్యారు. అయితే నీరు తాగడం ఎంత ముఖ్యమో వైద్యులు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో చల్లటి నీటిని తాగుతున్నారు. సాధారణంగా నీరు చల్లగా లేకపోతే తాగడానికి ఇష్టపడరు. కానీ కొందరు వెరీ కూల్ వాటర్ తీసుకోవడానికి అలవాటు పడుతారు. ఇలా వేసవిలో అయితే కూల్ వాటర్ లేకుండా వారికి అస్సలు దాహం తీరదు. అయితే ఇలా చల్లటీ నీరు తాగడం వల్ల ఎలాంటి నష్టాలు ఎదురవుతాయో తెలిస్తే.. మరోసారి అలాంటి పనులు చేయరు.. అవేంటో తెలుసుకుందామా.

నేటి కాలంలో చాలా మంది వేసవి బాధ నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్రిజ్ లను కొనుక్కుంటున్నారు. కొన్ని షోరూంలు సైతం తక్కువ ధరకు ఆఫర్లపై ఇస్తుండడంతో నిత్యవసరాల్లో ఫ్రిజ్ తప్పనిసరి అయింది. అయితే ఫ్రిజ్ లో ఆహార పదార్థాల కంటే ఎక్కువ శాతం నీటినే ఉంచుతున్నారు. కాలాలతో పని లేకుండా అన్ని కాలాల్లోనూ చల్లటి నీరు తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల వారిలో ఉండే డైజేషన్ సిస్టమ్ దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారం తినేటప్పుడు కూల్ వాటర్ తీసుకుంటే ఆహారం కుచించుకుపోయి జీర్ణమవదు.

మైగ్రేన్ ఉన్నవారు చల్లటి నీరు తీసుకోవడం వల్ల ప్రమాదరకరం అని అంటున్నారు. వీరు కూల్ వాటర్ తీసుకున్నప్పుడల్లా తలలో భారం అయినట్లు అవుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు సైతం చల్లటి నీటికి దూరంగా ఉండాలి. కిడ్నీ సమస్య ఉన్న వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతారు. కానీ నార్మల్ కూల్ ఉన్నవాటిని మాత్రమే తీసుకోవాలి. లేకుంటే కిడ్నీ పనితీరును బలహీనపరుస్తుందని అంటున్నారు.

చాలా మంది ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో జంక్ పుడ్ తిన్న తరువాత కూల్ వాటర్ తీసుకుంటే అది త్వరగా జీర్ణమవదు. దీంతో దాని సమతుల్యత దెబ్బతిని తిన్న ప్రయోజనం ఉండదు. కూల్ వాటర్ లేకుండా ఏమీ తినకుండా ఉంటారు. ఇలాంటి వారు వెంటనే నార్మల్ వాటర్ తీసుకోవడానికి అలవాటు పడాలి. ఎప్పటికైనా కూల్ వాటర్ తీసుకోవడం అంతమంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.