Dream House: సొంతింటి కల.. సామాన్యుడికి గగనమేనా?

Dream House: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే వీటికి ఖర్చే కానీ రాబడి ఉండదు. అందుకే ఇల్లు కట్టాలంటే కష్టమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల అందరికి కలగానే మిగిలిపోతోంది. మధ్యతరగతి ప్రజలైతే నానా తిప్పలు పడాల్సిందే. వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో వ్యయం భారీగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టాలంటే గుల్ల కావాల్సిందేనని మొత్తుకుంటున్నారు. సొంతింటి కల తీరడం గగనమే అని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకోవాలంటనే […]

Written By: Srinivas, Updated On : November 21, 2021 1:38 pm
Follow us on

Dream House: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. అంటే వీటికి ఖర్చే కానీ రాబడి ఉండదు. అందుకే ఇల్లు కట్టాలంటే కష్టమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సొంతింటి కల అందరికి కలగానే మిగిలిపోతోంది. మధ్యతరగతి ప్రజలైతే నానా తిప్పలు పడాల్సిందే. వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో వ్యయం భారీగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టాలంటే గుల్ల కావాల్సిందేనని మొత్తుకుంటున్నారు. సొంతింటి కల తీరడం గగనమే అని తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకోవాలంటనే భయపడుతున్నారు.

Also Read: వీధి వ్యాపారులకు రూ.20,000. ఈ స్కీమ్ ద్వారా సులువుగా లోన్ తీసుకునే ఛాన్స్!

Dream House

స్టీల్, సిమెంట్, విద్యుత్ ఉపకరణాల ధరలు భారీగా పెరిగాయి. 120 గజాల స్థలంలో వెయ్యి చదరపు అడుగుల ఇల్లు కట్టుకోవాలంటే సుమారు రూ.5 లక్షల వ్యయం అవుతోంది. దీంతో సామాన్యుడి జేబు గుల్ల అవుతున్నట్లు తెలుస్తోంది. ఇల్లు కట్టాలంటే జంకుతున్నారు. ఖర్చుకు వెనకాడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారు ఎలా కట్టుకోవాలని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్ కు ముందు ఉన్న ధరలు ఇప్పుడు లేవు. అప్పటికంటే ఇప్పుడు ధరలు రెండింతలు పెరిగాయి. దీంతో సిమెంట్ బస్తా గతంలో రూ.330 ఉండగా ప్రస్తుతం రూ.400 వరకు పెరిగింది. స్టీల్ కూడా టన్నుకు రూ. 65 వేలకు పెరగడం గమనార్హం. ఇసుక ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇల్లు నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది.

మరోవైపు కర్ర ధర కూడా పెరుగుతోంది. ప్లాస్టిక్ పైపులు, కాపర్ కేబుల్, శానిటరీ, టైల్స్ ధరలు కూడా 15 నుంచి 50 శాతం వరకు పెరగడం ఆందోళన కరమే. ఇల్లు నిర్మాణం చేయాలంటే అన్ని లెక్కలు వేసుకుంటే ప్రజలకు ఆందోళన పెరుగుతోంది. పెరిగిన ధరలతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. ధరలు పెరిగినా తమ బాధ్యత మరవకుండా ఇంటి నిర్మాణం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: ప్రియుడు మాట్లాడడం లేదని డయల్ 100కు ఫోన్ చేసిన లవర్

Tags