DRDO-GTRE Recruitment 2022: డీఆర్‌డీవో-గ్యాస్ టర్బైన్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 150 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వేర్వేరు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు తక్కువ మొత్తంలోనే వేతనం లభించనుందని తెలుస్తోంది. https://www.drdo.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీల ఉద్యోగ ఖాళీలు 75 ఉన్నాయి. బీఈ/బీటెక్/తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు కాగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 9,000 రూపాయలు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది.
Also Read: 14న ‘జనసేన’లో ఏం జరగబోతుంది..? పవన్ కళ్యాణ్ సంచలన స్టెప్?
డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీల ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 8,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీల ఉద్యోగ ఖాళీలు 25 ఉండగా వీళ్లకు 7,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలతో పాటు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు (జనరల్ స్ట్రీమ్) ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి.
అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది.
Also Read: అమెరికా ‘ఐఫోన్’కు పోటీగా ‘అయా టీ1’.. రష్యా సూపర్ ప్లాన్