https://oktelugu.com/

Tech Tips: మొబైల్ ఛార్జింగ్ 100 శాతం పెట్టొద్దా? ఎందుకు?

సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు 100 శాతం పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాం. కొందరికి ఉదయం సమయం దొరకకపోతే రాత్రిళ్లు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయం వరకు ఉంచుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2024 / 02:15 PM IST

    Tech Tips

    Follow us on

    Tech Tips: నేటి కాలంలో మొబైల్ లేకుండా కాలం గడవని పరిస్థితి. స్కూలు కెళ్ళే విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ యూజ్ చేస్తున్నారు. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం చేతిలో ఉన్నట్లే అని భావిస్తారు. అంతటి ప్రాధాన్యం కలిగిన మొబైల్ ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు మొబైల్ విషయంలో చాలా కేర్ గా ఉంటారు. మరి కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. గాడ్జెట్లలో అత్యంత అవసరమైన, అతి సున్నితమైన డివైజ్ కనుక మొబైల్ విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలోనూ కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవేంటంటే?

    సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు 100 శాతం పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తాం. కొందరికి ఉదయం సమయం దొరకకపోతే రాత్రిళ్లు ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉదయం వరకు ఉంచుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఫోన్ బ్యాటరీ పై ప్రభావం పడుతుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ 20 శాతం తక్కువైనా దానిని యూజ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా బ్యాటరీ నాశనం అవుతుంది. అందువల్ల 20 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఫోన్ చార్జింగ్ పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.

    ఇక అసలు విషయమేంటంటే ఒక్కోసారి ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా 100 శాతం పూర్తి కాదు. దీంతో ఫోన్ బ్యాటరీ పాడైపోయిందని అనుకుంటారు. కానీ ఫోన్ కంపెనీలు 100 శాతం ఛార్జింగ్ కు కొన్ని సార్లు మాత్రమే అనుమతించేలా సెట్ చేస్తారు. మొత్తంగా ఒక మొబైల్ 300 నుంచి 500 సార్లు 100 శాతం చార్జింగ్ అయ్యేలా పరిమితి విధిస్తారు. ఇది దాటిన తరువాత ఫోన్ ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా 100 శాతం పూర్తవదు. అయితే బ్యాటరీ క్షీణించకుండా ఉండడానికే ఇలా సెట్ చేశారు.

    అందువల్ల ఫోన్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 20 శాతానికి తక్కువ కాకుండా ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టాలి. అలాగే 100 శాతం వరకు వెయిట్ చేయకుండా 80 శాతం కాగానే ఛార్జర్ తీసేయాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఫోన్ కు నాణ్యమైన కంపెనీ ఛార్జర్ ను మాత్రమే వాడాలి. నకిలీ ఛార్జర్ వల్ల బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.