Telangana Accent: కాలం మారుతున్నా తెలంగాణ కవులు మన భాషను కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా మంది కవులు తెలంగాణ పదాలను పద్యాలుగా, కవితలుగా రాసుకుంటూ వచ్చారు. తెలంగాణ భాష గ్రాంధికం నుంచి పుట్టినదే. వ్యాకరణం తెసినవాలు శ్రద్ధగా పరిశీలిస్తే.. భాషలోని తియ్యదనం, అందలోని కమ్మదనం అర్థమవుతుంది. చోళులు, శాతవాహనులు, పల్లవులు, గోల్కోండ రాజులు వేళ ఏళ్ల క్రితం రాసిన పద్యాల్లోనూ తెలంగాణ పదాలు కనిపిస్తాయి. తెలంగాణ ప్రజల జీవితం కనిపిస్తుంది. 2 వేల ఏళ్ల క్రితం శాతవాహనుల రాజు భానుడు సేకరించిన సప్త శది పద్యాల్లో తెలంగాణ పదాలు వాడారు. పిల్ల, అత్త, పొట్ట, కత్తిలాంటి పదాలు చాలా కనిపిస్తాయి. మెదక్ జిల్లా తెర్లాపూర్ ప్రాంతంలో 1417 నాటి శాసనంలో తెలుంగపురం, తెలుగాణపురం అనే పదాలు కనిపిస్తాయి. అంటే తెలంగాణ పదం అప్పటి నుంచే ఉంది. 1510 నాటి వెలిచర్ల శాసనంలోనూ తెలంగాణ పదం కనిపిస్తుంది.
భాష నుంచే యాస..
తెలంగాణ భాష గ్రాంధికం నుంచే పుట్టింది అనడానికి కవులు చాలా ఉదాహరణలు చెబుతున్నారు. వస్తున్రు.. చేస్తున్రు.. పోతున్రు.. చేస్తున్రు అంటూ పదాలు వాడుతుంటారు. కానీ, ఈ యాస గ్రాంధికంలోనిది.. పద్యాల్లో కవులు చేసినారు.. చూసినారు.. వెళ్లినారు.. లాంటి పదాలు కనిపిస్తాయి. ఈ పదాలు చేసిన్రు.. చూసిన్రు, వెళ్లిన్రు లాంటి పదాల నుంచి పుట్టినవే. కానీ, ఇప్పుడు తెలంగాణ భాషను, యాసను అవహేళన చేయడం పెరిగింది. తాము మాట్లాడిందే నిజమైన భాష అని చాలా మంది భ్రమ పడుతున్నారు. కానీ, వ్యాకరణం తెలిసిన కవిని సంద్రిస్తే.. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాషగా చెబుతారు. గ్రాంధికానికి దగ్గరగా ఉందని అంటారు. ఇంగ్లిష్ ప్రభావంతో అచ్చులు, హల్లులు మారాయి తప్ప.. మూలం మాత్రం గ్రాంధికమే అంటారు.
పాల్కురికి సోమనాథుని కావ్యాల్లో
తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు రాసిన కావ్యాల్లో తెలుగు పదాలు చాలా కనిపిస్తాయి. బసవ పురాణంలో జనం పాటల గురించి ప్రస్తావించారు. కళారూపాలపైనా సోమనాథుడు తెలుగు పదాల్లో గొప్పదనాన్ని వర్ణించారు. బమ్మెర పోతన రాసిన గజేంద్ర మోక్షంలో తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇలా వందల ఏళ్ల క్రితం వాడిన పదాలు తెలంగాణ నుంచి తీసుకున్నవే. ధర్మపురి శేషప్ప రాసిన నారసింహ శతకం, నారసింహశర్మ రాసిన శ్రీకృష్ణ శతకం, కంచర్ల గోప్న నాసిన దాసరది శతకం, సిద్ధప్ప రాసిన శతకాల్లో తెలంగాణ పదాలు, మాండలిక ప్రయోగాలు చాలా ఉన్నాయి.
20వ శతాబ్దంలోనూ..
20వ శతాబ్దపు కవులు కూడా చాలా వరకు తెలంగాణ మాండలిక పదాలనే చాలా వరకు వాడారు. ఇందులో ముందుగా గుర్తొచ్చేది గోలకొండ కవులు. తెలంగాణలో కవులే లేరన్న ఓ ఆంధ్రా కవి అన్న మాటలకు నొచ్చుకున్న సురవరం ప్రతాపరెడ్డి గోలుకొండ కవుల పద్యాతో పుస్తకం అచ్చు వేయించారు. సురవరం ప్రతాపరెడ్డి రచనల్లోనూ తెలంగాణ జనం భాషనే వాడారు. ఇక తెలంగాణ పదాలను కవిత్వం నిండా నింపింది మహాకవి కాళోజీ నారాయణరావు. అన్నపు రాసులొకదిక్కు.. ఆకలి మంటలొకదిక్కు అని జనం వాడే చిన్నచిన్న మాటలతో గొప్ప కవిత్వం రాశారు కాళోజీ. వామమామలై వరదాచార్యులు. బండి యాదగిరి, గంగుల సాయిరెడ్డి, పొలంపల్లి రామారావు లాంటి కవులు కూడా తెలంగాణ జీవితాన్ని కవితలు, పద్యాల రూపంలో వివరించారు.