https://oktelugu.com/

Traffic Challan: అస్సలు కట్టకండి.. ఎందుకంటే?

రోడ్డు ట్రాన్స్ పోర్టు యాక్ట్ ప్రకారం వాహనాలపై ప్రయాణం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఏ వాహనంపై ప్రయాణం చేస్తున్నామో.. ఆ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 21, 2024 / 10:53 AM IST

    Traffic-Challan

    Follow us on

    Traffic Challan: రోడ్డు ట్రాన్స్ పోర్టు యాక్ట్ ప్రకారం వాహనాలపై ప్రయాణం చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఏ వాహనంపై ప్రయాణం చేస్తున్నామో.. ఆ వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఇవి లేకుండా ప్రయాణం చేసేవారు.. ట్రాఫిక్ పోలీసులకు దొరికితే జరిమానా విధిస్తారు. అలాగే హెల్మెట్ ధరించకపోయినా.. రాంగ్ రూట్ లో ప్రయాణం చేసినా.. చలాన్లు వేస్తారు. ఈ చలాన్ కట్టే ముందు వాహనానికి సంబంధించిన మొబైల్ నెంబర్ ఏది లింక్ అయి ఉందో.. దానికి మెసేజ్ వస్తుంది. ఆ తరువాత నిర్ణీత గడువు నిర్ణయిస్తారు. ఆ గడువు తేదీలోగా చెల్లించకపోతే అదనంగా ఛార్జీ చేస్తారు. అయితే ఒక్కోసారి మీ మొబైల్ కు చలాన్ కట్టమని మెసెజ్ వస్తే అస్సలు కట్టకండి.. ఎందుకంటే?

    Technology Develop అవుతున్న కొద్దీ పనులు ఈజీగా మారుతున్నాయి. కానీ ఇదే సమయంలో మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. కొందరు సైబర్ నేరగాళ్లు టెక్నికల్ గా ప్రజల వద్ద నుంచి విలువైన సమాచారం సేకరించి వారి వద్ద నుంచి డబ్బును దోచుకుంటున్నారు. వీటిపై ప్రత్యేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొందరు సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఆగడం లేదు. రోజుకో కొత్త మోసంతో మొబైల్స్ కు మెసేజ్ లు పంపిస్తూ వారి నుంచి డీటేయిల్స్ లాక్కుంటారు.

    తాజాగా కొత్తరకం మోసంతో సైబర్ నేరగాల్లు ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దోచుకుంటున్నారు. సాధారణంగా వాహనాలపై ప్రయాణం చేసే సమయంలో ఏదైనామిస్టేక్ అయితే ఫైన్ పడుద్ది. ఉదాహరణకు హెల్మెట్ లేకపోయినా, రాంగ్ రూట్ లో ప్రయాణించినా.. ఆ ప్రదేశంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఫోటో తీసి చలాన్ ను నిర్ణయిస్తారు. ఇందుకు సంబందించిన మెసేజ్ మొబైల్ కు వస్తుంది. అయితే ఇలాంటి మెసేజ్ ఒకటి వస్తుంది. ట్రాఫిక్ చలాన్ కట్టడానికి ఈ రకమైన యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతారు.

    ఈ మెసేజ్ చివరకు .apk అని ఉంటుంది. ఇలాంటి మెసేజ్ లు ఇదివరకే మొబైల్స్ కు రావడంతో చాలా మంది అప్రమత్తమైన వాటి జోలికి వెళ్లడం లేదు. అయితే వాహనానికి సంబంధించిన చలాన్ కట్టడానికి ఓ యాప్ ను డౌన్లో డ్ చేసుకోవాలని మెసేజ్ పంపుతున్నారు. దీనిని డౌన్లోడ్ చేయడం వల్ల ఫోన్ లోని డేటా అంతా సైబర్ నేరగాళ్లకు వెళ్తుంది. దీంతో వారు బ్యాంకు అకౌంట్ లోని డబ్బులన్నీ మాయం చేసే అవకాశం ఉంది.

    అందువల్ల ఇలాంటి మెసేజ్ వస్తే అవైడ్ చేయాలి. అంతేకాకుండా వాహనాలకు సంబంధించిన చలాన్ ను కట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా వెబ్ సైట్ e challan ను ఏర్పాటు చేసింది. ఇందులో ముందుగా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆ తరువాత చలాన్ ఉందో లేదో మెసేజ్ వస్తుంది. ఉంటే అక్కడే పే బిల్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఫోన్ పే లేదా గూగుల్ పే లింక్ తో చలాన్ ను చెల్లించవచ్చు.