Puja for children : ప్రస్తుత కాలంలో చాలామంది ఇద్దరు కంటే ఎక్కువమంది సంతానాన్ని కోరుకోవడం లేదు. కానీ కొంతమందికి అసలే సంతానం కావడం లేదు. అందుకో కారణాలు అనేకంగా ఉండవచ్చు. కానీ ప్రతి తల్లికి, తండ్రికి తమ పిల్లలతో కలిసిమెలిసి ఉండాలని.. జీవించాలని ఎంతో పరితపిస్తూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పూజలు చేస్తారు. ఎక్కడో దూరాన ఉన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఇరుగుపొరుగు వారు చెప్పినవన్నీ పాటిస్తారు. కానీ కొంతమంది ఆధ్యాత్మిక వాదులు చెబుతున్న ప్రకారం సంతానం కావాలని అనుకునేవారు ఎక్కడో దూరాన వెళ్లకుండా ఇంట్లోనే ఇలా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అంటున్నారు. అదేంటంటే?
సంతానం కలగడానికి దైవ సహాయం కూడా ఉండాలని కొందరు చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా పిల్లలు కోరుకునే వారు ప్రతిరోజు పూజ చేసేవారు ఉన్నారు. తమకు ఎలాగైనా సంతానం కావాలని వ్రతాలు, నోములు చేస్తుంటారు. అయితే సర్వదేవతలు అంతా ఇంట్లోనే కొలువై ఉంటారని కొందరు చెబుతూ ఉంటారు. అందువల్ల ఇంట్లోనే నచ్చిన దేవుళ్లను మనస్ఫూర్తిగా కొలవడం వల్ల అనుకున్న సంతానాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటే రోజు కొన్నిసార్లు’ శ్రీ మాత్రే నమః’ అని అమ్మవారిని కొలుస్తూ ఉండాలి. ఇలా 11 లేదా 108 సార్లు అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత కచ్చితంగా ఫలితం ఉంటుందని చెబుతున్నారు. సంతానం కలగడానికి అమ్మవారి దీవెనే ఎక్కువగా ఉంటుందని.. అందువల్ల అమ్మవారి ఆశీర్వాదం పొందేందుకు ఎక్కడో దూరాన వెళ్లకుండా ఇంట్లోనే మనస్ఫూర్తిగా పూజ చేయాలని అంటున్నారు. అయితే అమ్మవారికి పూజ చేసే ముందు ఒకసారి తమకు మంచి సంతానం కావాలని కోరుకోవాలి. అలా కోరుకుంటే కచ్చితంగా కరుణిస్తారని చెబుతున్నారు.
అయితే కొందరు తమకు మగపిల్లాడు మాత్రమే కావాలని కోరుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల అమ్మవారు ఆగ్రహిస్తారని చెబుతున్నారు. ఎందుకంటే మంచి సంతానం ఎవరైనా పర్వాలేదు. మగపిల్లాడు మాత్రమే కావాలని కోరుకోవడం మూర్ఖత్వం అవుతుంది అని చెబుతున్నారు. ఆడవారైనా.. మగవారైనా మంచి సంతానమైతే వారి ఇల్లు సంతోషంగా ఉంటుంది. సంతోషాన్ని కోరుకునే వారు అయితే ఎవరైనా సంతానం కావాలని అనుకుంటారు. అలాకాకుండా వివక్ష చూపితే మాత్రం అమ్మవారు ఆగ్రహిస్తారని చెబుతున్నారు.
అందువల్ల సంతానం కావాలని అనుకునేవారు డబ్బులు వృధా చేసుకోకుండా ఇంట్లోనే ప్రతిరోజు అమ్మవారిని కోరుకోవాలని.. ఎప్పటికైనా కరుణించే అవకాశం ఉంటుందని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అంతేకాకుండా సంతానం కలిగిన తర్వాత కూడా వారి జీవితం బాగుండాలని కోరుకోవడం వల్ల వారు అనుకున్న స్థాయిలో రాణిస్తూ ఉంటారు. సృష్టికి మూలం అమ్మవారే. అందువల్ల ఆ మాత ఆజ్ఞ కోసం పరితపిస్తూ ఉండాలని చెబుతూ ఉన్నారు.