After Meals: ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనుకుంటారు అందరూ. కానీ కొన్ని చేయకూడని పనులు చేస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటూ ఉంటారు. ఇవి సాధారణ పనులైన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఏ పని చేసిన తర్వాత ఏ పని చేయాలో తెలియక తప్పులు చేస్తూ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుంది. వీటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా వీటిని చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఎటువంటి నష్టాలు లేకపోయినా దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉంటాయి. అసలు భోజనం చేసిన తర్వాత ఈ పనులు చేస్తే ఆరోగ్యం మాత్రం అదుపులో ఉండే అవకాశం లేదని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మరి ఏ పనులు చేయకుండా ఉండాలి?
భోజనం చేసిన తర్వాత కొంతమంది పురుషులకు ధూమపానం చేయడం అలవాటు. ధూమపానం చేసిన తర్వాత శరీరంలోని ఆహారాన్ని త్వరగా జీర్ణం కానివ్వకుండా అడ్డుకుంటుంది. జీర్ణక్రియలో భాగంగా కడుపులో ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో ఆహారం జీర్ణం అయ్యే క్రమంలో ఊపిరితిత్తులు కూడా సరైన గాలిని అందించి జీర్ణ క్రియకు తోడ్పడుతాయి. కానీ ఇదే సమయంలో ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడి జీర్ణ క్రియ కు అడ్డంకిగా ఏర్పడే అవకాశం ఉంది.
ఆహారం తిన్నావంటనే చాలామంది స్నానం చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ అకస్మాత్తుగా మారిపోతుంటుంది. దీంతో ఇది జీర్ణ క్రియ కు సహకరించదు. రక్త ప్రసన్న సరిగ్గా లేకపోవడం వల్ల కడుపులో భారంగా ఏర్పడి చిన్న ఆహారం చేయడం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా స్నానం చేసినప్పుడు శరీరంలోని వేడి తగ్గుతుంది. వాస్తవానికి జీర్ణ క్రియ కు శరీరంలో ఉష్ణోగ్రత అవసరం. అలాంటప్పుడు సహనం చేస్తే శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాకుండా అలాగే ఉండిపోతుంది. అయితే తప్పనిసరిగా స్నానం చేయాలి అనుకుంటే భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల పాటు వేచి చూడడం మంచిది.
కొంతమందికి భోజనం చేసిన తర్వాత వెంటనే టీ తాగడం అలవాటు. టీ లో టానిన్లు, ఇనుము ఉండడంవల్ల ఇది కడుపులో ఉండే ఆమ్లానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. తిన్న ఆహారం జీర్ణించే క్రమంలో టీ తాగడం వల్ల మరింత ఆంగ్లం గా తయారై ఆహారం త్వరగా జీర్ణం కాకుండా ఉంటుంది. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు ఆకుకూరలు వంటివి తిన్న తర్వాత టీ తాగితే ఇనుము అధికంగా శరీరంలోకి వెళ్లి రక్తహీనతకు గురై అవకాశం ఉంది.
ఆహారం తిన్న వెంటనే కాసేపు నడవడం చాలా మంచిది. కానీ కొందరు మరింత వేగంగా నడుస్తూ ఉంటారు. ఇలా వేగంగా నడవడం ద్వారా రక్త ప్రసరణ లో తేడా ఏర్పడి జీర్ణ క్రియ సమస్యలు ఉంటాయి. అందువల్ల కాస్త మెల్లగా నడిచి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవడం మంచిది.