Walking Benefits: ఆధునిక కాలంలో జీవనశైలి మారుతోంది. తినే ఆహారం కూడా కల్తీమయంగా ఉంటోంది. దీంతో మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయి. మన ఆరోగ్యం మన చేతుల్లో లేకుండా పోతోంది. ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆరోగ్యానికి నడక దివ్య ఔషధంగా సాయపడుతుంది. అందుకే పొద్దున్నే లేచి రోజుకు కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజు వాకింగ్ చేయడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

ఈ రోజుల్లో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చిన్న వయసులోనే దరిచేరుతున్నాయి. వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి నానా రకాల మందులు మింగాల్సి వస్తోంది. రోజువారి మందులు వేసుకునే సంఖ్య పెంచుకుంటున్నాం. భవిష్యత్ లో వీటితో ఎన్నో నష్టాలు ఉండటంతో మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి చక్కని నడక, వ్యాయామం, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. ఇలా మన దినచర్యలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
పలు రకాల వ్యాధులు మన దరిచేరేందుకు మనమే కారణమవుతున్నాం. నియంత్రణ లేని ఆహారంతో మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోజు క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఎన్నో కేలరీల శక్తి ఖర్చవుతుంది. దీంతో మనకు ఆరోగ్య రక్షణ చోటుచేసుకుంది. వాకింగ్ తో దాదాపు 25 రకాల రోగాలు రాకుండా ఉంటాయని తెలియకపోవడం గమనార్హం. ఇంకా పరుగెత్తితే 120 కేలరీల శక్తి ఖర్చవుతుంటే వాకింగ్ చేయడం ద్వారా 240 కేలరీల శక్తి ఖర్చుకావడం గమనార్హం.

వాకింగ్ చేయడంతో షుగర్, బీపీ నియంత్రణలోకి వస్తాయి. గుండె జబ్బుల ముప్పు ఉండదు. వాకింగ్ చేయడంతో ఇన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే వాస్తవాలు అందరికి తెలియడంతో ఈ రోజుల్లో చాలా మంది దాని వైపు మొగ్గు చూపుతున్నారు. నడకతో ఎన్నో రకాల వ్యాధులు రాకుండా చేసుకుంటున్నారు. వాకింగ్ ద్వారా అధిక బరువు తగ్గుతున్నారు. వైద్యుల సూచనల మేరకు రోజు వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకుని మసలుకుని శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది.