Homeఎంటర్టైన్మెంట్Jabardasth Ram Prasad: జబర్దస్త్ రామ్ ప్రసాద్ కి ఏమైంది... ఆందోళనలో ఫ్యాన్స్ 

Jabardasth Ram Prasad: జబర్దస్త్ రామ్ ప్రసాద్ కి ఏమైంది… ఆందోళనలో ఫ్యాన్స్ 

Jabardasth Ram Prasad: జబర్దస్త్ స్టార్ కమెడియన్స్ లో రామ్ ప్రసాద్ ఒకరు. సుడిగాలి సుధీర్ టీం మెంబర్ గా ఆయన మంచి పాపులారిటీ రాబట్టారు. సుధీర్, గెటప్ శ్రీనులతో కలిసి రామ్ ప్రసాద్ పంచే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఆటో పంచ్ డైలాగ్స్ కి రామ్ ప్రసాద్ బాగా ఫేమస్. అందుకే ఆయన్ని ఆటో రామ్ ప్రసాద్ అంటారు. జబర్దస్త్ లో సంచలనాలు చేసిన సుడిగాలి సుధీర్ టీం కి స్కిట్స్ రాసేది రామ్ ప్రసాదే. జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీ ఆయన్ని నటుడిని చేసింది. సినిమాల్లో కమెడియన్ గా కూడా రామ్ ప్రసాద్ చేస్తున్నారు.

Jabardasth Ram Prasad
Jabardasth Ram Prasad

అయితే రామ్ ప్రసాద్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఆయన తల కవర్ చేసుకొని కనిపించారు. రామ్ ప్రసాద్ లుక్ చూస్తే ఆయన ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే తలకు మాస్క్ పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు మూవీ విడుదలైంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు జబర్దస్త్ మిత్రులు అందరూ వచ్చారు. అయితే రామ్ ప్రసాద్ రాలేదు. ఫోన్లోనే బెస్ట్ విషెస్ చెప్పాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ ప్రసాద్ కి ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రామ్ ప్రసాద్ కి ఏమీ కాలేదు. ఆయన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. అందుకే తలకు మాస్క్ తో కనిపిస్తున్నారు. అంతకు మించి వేరే కారణాలు లేవు. రామ్ ప్రసాద్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ విశ్వసనీయ సమాచారం అందుతుంది. విషయం తెలిశాక ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Jabardasth Ram Prasad
Jabardasth Ram Prasad

 

కాగా ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం టాప్. వారి స్కిట్స్ మంచి కామెడీ పంచుతాయి. ఏళ్ల తరబడి ముగ్గురు మిత్రులు నాన్ స్టాప్ కామెడీ పంచారు. అయితే సుడిగాలి సుధీర్ టీమ్ విచ్ఛిన్నం అయ్యింది. కొన్నాళ్ళు కేవలం రామ్ ప్రసాద్ మాత్రమే స్కిట్స్ నడిపించారు. సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడంతో కొత్త కమెడియన్స్ ని తీసుకొని రామ్ ప్రసాద్ స్కిట్స్ చేశారు. గత స్కిట్స్ కి రామ్ ప్రసాద్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కాగా గెటప్ శ్రీను తిరిగి వచ్చాడు. రామ్ ప్రసాద్ తో పాటు స్కిట్స్ చేస్తున్నారు. సుడిగాలి సుధీర్ మాత్రం ఇంకా రాలేదు. ఆయన త్వరలో వస్తున్నానని ప్రకటించారు కానీ, అది జరగలేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version