Soul after Death: పుట్టే ప్రతి వ్యక్తి గిట్టక మానడు.. అది చాలామంది పెద్దలు, ఆధ్యాత్మిక వాదులు చెబుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి పుట్టుక, మరణం సహజం అని అంటుంటారు. అయితే పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితాంతం ఎలాంటి పనులు చేశాడు? ఏ విధంగా సంబంధాలు నెలకొల్పాడు? అన్నవి తన జీవితంలో గుర్తుండిపోతాయి. అయితే ఆ వ్యక్తి చేసిన పాప, పుణ్యాల ప్రకారమే అతడు మరణించిన తర్వాత తన స్థితిగతులు ఉంటాయని గరుడ పురాణం ప్రకారం తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలా ఇంటికి ఎందుకు వస్తానంటే?
గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన దేహం విడిచి ఆత్మగా మారిపోతుంది. ఈ ఆత్మ కేవలం యమదూతలకు మాత్రమే కనిపిస్తుంది. అయితే మరణించిన వెంటనే వ్యక్తి యమలోకానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తాడు. తనకోసం ఏడ్చే వారికోసం మళ్లీ బతకాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ సమయంలో ఆత్మ తిరిగి తన శరీరంలోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ యమదూతలు అలా సాధ్యం కాకుండా అడ్డుపడుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి దహన సంస్కారాలతో పాటు 11 రోజులపాటు నిర్వహించిన కర్మకాండల ప్రకారం అతనికి ఒక రూపం వస్తుంది. 11 రోజుల తర్వాత ఆ వ్యక్తి యమలోకానికి ప్రయాణం ప్రారంభిస్తాడు. ఇలా ఏడాది పాటు ప్రయాణించి చివరికి యమలోకానికి చేరుకుంటాడు.
అయితే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు అతనికి సరైన విధంలో కర్మకాండలు నిర్వహిస్తేనే అతడి ప్రయాణం సులువుగా ఉంటుంది. అలాకాకుండా కుటుంబ సభ్యులు కర్మకాండలో సరైన విధంగా నిర్వహించకపోతే ఆత్మకు ఒక రూపం రాకుండా ఉంటుంది. ఈ క్రమంలో రూపంలేని ఆత్మను యమదూతలు హింసిస్తూ ఉంటారు. బలవంతంగా ఆత్మను తీసుకుపోతూ ఉంటారు. అయితే ఆ ఆత్మబడే క్షోభ కుటుంబ సభ్యులపై పడుతుంది. అతడి కోపం, క్రోధం వలన కుటుంబ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అందువల్ల గరుడ పురాణ ప్రకారం మరణించిన వ్యక్తిని దైవంగా భావించి అతడి కర్మకాండలను సక్రమంగా నిర్వహించాలని అంటారు.
అంతేకాకుండా 11 రోజుల వ్యక్తి ఏడాది పాటు యమలోకానికి ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు తనకోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూస్తూ వెళ్తాడు. ఏడాది తర్వాత నిర్వహించే కర్మకాండల పుణ్యంతో అతడు సరైన విధంగా యమలోకానికి చేరుకుంటాడు. ఈ కర్మకాండలు నిర్వహించని పక్షంలో అతడి ఆత్మ బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ చివరికి యమలోకానికి చేరినా కూడా.. అతని పాప పుణ్యాల తో శిక్షలు ఉంటాయి. అందువల్ల గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తి విషయంలో ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా కర్మకాండలు నిర్వహించాలని పండితులు చెబుతుంటారు.