Dad : నాన్న ఇంత కష్టపడతాడా? కనీసం మీరు దాన్ని గుర్తించారా?

నాన్న ఒక శ్రమజీవి. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తూనే ఉంటాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేసే గొప్ప మనిషి ఆయన. తన ఇష్టాలు కూడా కుటుంబం కోసం మర్చిపోతుంటాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికడమే ఆయనకు తెలుసు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో పెద్దగా గుర్తింపు లేదు కదా. అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్ని ఇస్తాడు అని అంటారు. కానీ ఇందులో చాలా నిజం ఉంది కదా. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే .. నాన్న కష్టాలు రాకుండా తన జీవితాన్ని కాపలా పెడుతుంటాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టం మాత్రం గుండెల్లో ఉంటుంది. అలుపెరగని సైనికుడి మాదిరి తన జీవన పోరాటం సాగిస్తుంటాడు. తన అలసటని కూడా కనపడనివ్వడు.

Written By: Swathi Chilukuri, Updated On : October 28, 2024 4:03 pm

Does dad work this hard? At least you figured it out?

Follow us on

dad : నిజంగానే నాన్న కష్టం గురించి మాట్లాడుకుంటే సమాజంలో ఎక్కడా చర్చ నడవదు. కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రి పడే కష్టం చాలా మందికి కంటికి కనిపించదు. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అంటూ ఒక్కొక్క బాధ్యతల్ని ఒక్కో స్టేజ్ లో పూర్తి చేస్తుంటాడు. కానీ ప్రతిసారి బాధ్యతనే మోస్తుంటాడు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించే వరకు తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పడం కష్టమే. ఆడవారితో కంపేర్ చేస్తే మగవారి జీవితం ఎక్కువగా బయట ప్రపంచంలోనే గడిచిపోతుంది. పిల్లలతో గడపడం వారితో సంతోషాలు, సరదాలు తక్కువ అనే చెప్పాలి. కుటుంబాన్ని పోషించడానికి రోజంతా శ్రమ పడి వచ్చి కాసేపు తన బిడ్డలతో గడిపే సమయం అరుదుగా దొరుకుతుంది. తండ్రి అంటే పిల్లలకు ఎక్కడో చిన్న భయం ఉంటుంది. తండ్రి పెట్టే ఆ భయం వెనుక అతను ఇచ్చే భద్రత, క్రమశిక్షణ దాగి ఉంటాయి.

తండ్రికి కొడుకుతో కన్నా కూతురుతో ఉండే అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఏ విషయాన్నైనా తండ్రికి షేర్ చేయడానికి కొడుకు భయపడితే.. కూతురు ధైర్యంగా చెప్పడంతో మాత్రం కామన్ గా చూస్తుంటాం. దీంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మెట్టినింటికి వెళ్లిపోతుంటే తల్లి పైకి వెక్కి వెక్కి ఏడుస్తుంటే తండ్రి మాత్రం లోలోపల కుమిలిపోతుంటాడు. కొడుకు పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది కానీ బాధ్యతలు నేర్పించాలనే నెపంతో కాస్త కఠినంగా ప్రవర్తిస్తాడు ఆ మహానీయుడు. అయినా బిడ్డలంటే తండ్రికి పంచ ప్రాణాలు.

కాలం మారిపోయింది.. రెక్కలొచ్చిన బిడ్డలు తల్లితండ్రుల్ని మర్చిపోవడం కూడా కామన్ గా చూస్తున్నాం. తమ దారి చూసుకుని వెళ్లిపోతున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. పేరెంట్స్ కూడా బిడ్డలను కనడమే కానీ వారు తమని చూస్తారనే నమ్మకం కూడా లేదట. అందుకే ఆ భ్రమలు వదిలి వాస్తవంలో జీవించేస్తున్నారు. వారికి భవిష్యత్తు ఇచ్చి తమ అడ్రస్ వృద్ధాశ్రమాలే అని ముందునుంచే ఫిక్స్ అవుతూనే గుండెను కఠినంగా మార్చుకుంటున్నారు. ఎదురుగా ఉన్నా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు కొందరైతే.. విదేశాల్లో స్థిరపడిపోయి పేరెంట్స్‌కి డబ్బులు పంపించి వారి బాధ్యతలు చూసేస్తున్న పిల్లలు కూడా చాలా మందే ఉన్నారు. కానీ వారి చివరి క్షణాల్లో అయినా కనీసం వారికి తోడుగా ఉండండి.