Bigg Boss Telugu 8: యష్మీ ని అక్కా అని పిలిచిన గౌతమ్..నన్ను అలా పిలవొద్దు అని ఏడ్చిన యష్మీ..వైరల్ అవుతున్న వీడియో!

గౌతమ్ అంటే ఇష్టం ఉన్నట్టుగానే ప్రవర్తించింది. అలా ప్రవర్తించడానికి కారణం నిఖిల్ ని ఉడికించడానికి అనే విషయం గత వీకెండ్ ఎపిసోడ్ లో రివీల్ అయిపోయింది. నిఖిల్ ని ప్రేమలో పడేయడం కోసం నా ఎమోషన్స్ తో యష్మీ ఆడుకుందా అని గౌతమ్ పాపం చాలా ఫీల్ అయిపోయాడు.

Written By: Vicky, Updated On : October 28, 2024 3:55 pm

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8: గత రెండు మూడు వారాల నుండి, ముఖ్యంగా సోనియా ఎలిమినేట్ అయ్యినప్పటి నుండి బిగ్ బాస్ లో లవ్ ట్రాక్స్ ఎక్కువ అయిపోయాయి. విష్ణుప్రియ పృథ్వీ వెంటపడడం, అలాగే యష్మీ నిఖిల్ వెంట పడడం మనం చూస్తూనే ఉన్నాం. మధ్యలో గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా హౌస్ లోకి అడుగుపెట్టడం, యష్మీ తో పులిహోర కలపడం వంటివి చేసాడు. ఒక ఎపిసోడ్ లో ఆయన నేరుగా యష్మీ కి ప్రపోజ్ చేసి, నువ్వు నా క్రష్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రపోజల్ ని యష్మీ రిజెక్ట్ చేయలేదు, అలా అని అంగీకరించలేదు. కానీ గౌతమ్ అంటే ఇష్టం ఉన్నట్టుగానే ప్రవర్తించింది. అలా ప్రవర్తించడానికి కారణం నిఖిల్ ని ఉడికించడానికి అనే విషయం గత వీకెండ్ ఎపిసోడ్ లో రివీల్ అయిపోయింది. నిఖిల్ ని ప్రేమలో పడేయడం కోసం నా ఎమోషన్స్ తో యష్మీ ఆడుకుందా అని గౌతమ్ పాపం చాలా ఫీల్ అయిపోయాడు.

ఆ స్థానం లో ఏ అబ్బాయి ఉన్నా యష్మీ పై రియాక్షన్ అయ్యే విధానం వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం చాలా కూల్ గా స్పందించి, ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఒక కంటెస్టెంట్ గా మాత్రమే నీతో మాట్లాడుతాను అని చెప్పుకొచ్చాడు. అయితే కాసేపటి క్రితమే నేటి నామినేషన్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమోలో యష్మీ ని గౌతమ్ ‘అక్కా’ అని పిలవడం హైలైట్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మెగా చీఫ్ అయ్యినందుకు విష్ణు ప్రియ ని 5 మంది కంటెస్టెంట్స్ ని ఎంచుకొని నామినేట్ చేసి జైల్లో పెట్టాలని చెప్తాడు బిగ్ బాస్. విష్ణు ప్రియ ముందుగా గౌతమ్ ని ఎంచుకుంటుంది. అప్పుడు గౌతమ్ ‘ప్రతీ వారం నన్ను ఈ పాయింట్ తోనే నామినేట్ చేస్తారా’ అని అడుగుతాడు. దానికి విష్ణు ప్రియ ‘నేను గత వారమే ఈ పాయింట్ మీద నామినేట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మెగా చీఫ్ అయ్యావు’ అని అంటుంది.

అలా వీళ్ళ మధ్య చర్చ నడుస్తున్నప్పుడు యష్మీ టాపిక్ వస్తుంది. అప్పుడు యష్మీ మాట్లాడుతూ ‘ఈ విషయం పై ఇక మాట్లాడకు. నేను కూడా దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది’ అని అంటుంది. దానికి గౌతమ్ యష్మీ ని అక్కా నువ్వు ఆగు అంటాడు. అప్పుడు యష్మీ ‘అక్కా అని పిలవొద్దు’ అంటూ గట్టిగా అరుస్తుంది. ‘ఒకసారి క్రష్ అని చెప్పి, ఇంకోసారి అక్కా అని పిలవొద్దు’ అని అంటుంది. ఇక ఆ తర్వాత విష్ణు ప్రియ ని పృథ్వీ విషయం లో పరోక్షంగా ట్రిగ్గర్ చేస్తాడు. దీనికి పృథ్వీ మధ్యలో కలుగచేసుకుంటాడు. గౌతమ్, పృథ్వీ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు ఆ ప్రోమో లో చూపించారు. సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమోని మీరు కూడా చూసేయండి.