Diapers: దేశంలో రోజురోజుకు డైపర్ల వాడకం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది బట్టతో చేసిన డైపర్లను వినియోగిస్తుంటే మరి కొందరు మాత్రం డిస్పోజబుల్ డైపర్లను వినియోగిస్తున్నారు. అయితే డైపర్లను వాడే విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలి. డైపర్లను ఇష్టానుసారం వాడితే పిల్లలకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్టతో చేసిన డైపర్లను వినియోగించడం వల్ల మలమూత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే బట్టతో చేసిన డైపర్లను వినియోగించడం బెస్ట్ అని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. డిస్పోజబుల్ డైపర్లను వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. వాటర్ ప్రూఫ్ ఉన్న ప్లాస్టిక్ ను బట్టతో తయారు చేసిన డైపర్లో వినియోగిస్తే మంచిదని చెప్పవచ్చు. సాధారణ బట్టలతో కలిపి బట్టతో తయారు చేసిన డైపర్లను ఉతకకూడదు.
బట్టతో తయారు చేసిన డైపర్లను వేడి నీటిలో ఉతకడం వల్ల పిల్లలకు చర్మ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. పిల్లలు యూరిన్ చేస్తే వెంటనే డైపర్లను మార్చాలి. డైపర్లను త్వరగా మార్చని పక్షంలో చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. పిల్లలు పాలు తాగిన తర్వాత డైపర్ ను వేస్తే మంచిదని చెప్పవచ్చు. డైపర్ వేయడానికి ముందు శరీర భాగంపై పౌడర్ వేయాలని భావిస్తే చేతితో వేయకూడదు.
డైపర్ల వాడకం వల్ల పిల్లల నడకలో మార్పు వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు. పిల్లలకు బట్టతో తయారు చేసిన డైపర్ ను వాడితే మాత్రమే టాయిలెట్ ట్రైనింగ్ సులభమవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.