Airtel Super Offer: ప్రముఖ టెలీకాం కంపెనీలలో ఒకటైన ఎయిర్‌టెల్ వినియోగదారులకు అదిరిపోయే తీపికబురును అందించింది. వినియోగదారులను నిలుపుకోవాలనే ఉద్దేశంతో ఎయిర్‌టెల్ తాజాగా ఒక కీలక ప్రకటనను చేసింది. మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్ అమలులో భాగంగా ఎయిర్‌టెల్ 12,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే కస్టమర్లు ఏకంగా 6,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.

150 స్మార్ట్ ఫోన్లను ఎయిర్‌టెల్ జాబితాలో చేర్చగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఎయిర్ టెల్ కస్టమర్లు ఈ ఆఫర్ కు అర్హత సాధించాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాల పాటు 249 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది.
18 నెలల తర్వాత 2000 రూపాయల చొప్పున క్యాష్ బ్యాక్ ను అందుకునే అవకాశం ఉండగా మూడు సంవత్సరాల తర్వాత మిగిలిన 4,000 రూపాయల క్యాష్ బ్యాక్ ను అందుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎయిర్‌టెల్ వెబ్ సైట్ ను సంప్రదించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 249 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువమొత్తం రీఛార్జ్ చేయడం ద్వారా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది.
ఎయిర్‌టెల్ తెలిపిన 150కు పైగా ఫోన్ల జాబితాలో ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన ఫోన్లు ఉండటం గమనార్హం. దేశంలో రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. ఖరీదైన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడంతో పాటు క్యాష్ బ్యాక్ ను పొందాలని భావించే వాళ్లకు ఈ స్మార్ట్ ఫోన్లు బెస్ట్ అని చెప్పవచ్చు.