Canada: కరోనా వైరస్ ప్రజలను గజగజా వణికించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు అదుపులోకి రాగా దేశంలోని ప్రజలు కరోనా పేరు వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కెనడా దేశానికి చెందిన ప్రజలను కొత్త వ్యాధి తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. కెనడా ప్రజలు మెదడుకు సంబంధించిన అంతుచిక్కని వ్యాధి వల్ల తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం.

కెనడా దేశంలోని బ్రన్‌స్విక్ ప్రావిన్స్ అనే ప్రాంతంలో ఈ కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 48 మంది ఈ వ్యాధి బారిన పడినట్టు తెలుస్తోంది. కండరాల నొప్పులు, ఒత్తిడి, మతిమరపు, తికమకపడటం లాంటి లక్షణాలు ఈ వ్యాధిబారిన పడిన వ్యక్తులలో కనిపిస్తాయి. డాక్టర్లకు సైతం ఈ వ్యాధి అంతుచిక్కటం లేదు. ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వాళ్లు తీవ్ర మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు.
18 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వైద్య నిపుణులు చనిపోయిన వ్యక్తుల మెదళ్లను స్కానింగ్ తీసి వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఈ వింత వ్యాధి వల్ల కెనడా ప్రజలు ఆందోళనకు గురవుతూ ఉండటం గమనార్హం. ఈ ప్రాంతంలోని వ్యక్తులు అబ్ నార్మల్ న్యూరో సమస్యలతో బాధ పడుతున్నారు.
దాదాపు ఇదే లక్షణాలతో ‘హవానా సిండ్రోమ్’ అనే వ్యాధిబారిన అమెరికాకు చెందిన సైనికాధిరులతో పాటు అమెరికా దౌత్యవేత్తలు పడ్డారు. కాలం మారే కొద్దీ వెలుగులోకి వస్తున్న కొత్త వ్యాధులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.