Dragon River: ప్రకృతి అమ్మఒడి లాంటిది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు, అద్భుతాలు దాగుంటాయి. కొన్ని మనకు కనిపిస్తాయి. ఇంకొన్ని కనిపించవు. అక్కడికి మనం వెళ్లలేం కూడా. కానీ సామాజిక మాధ్యమాల పుణ్యమాని ప్రతీది మనకు కళ్లకు కట్టినట్లే కనిపించే తంత్రం మన చేతుల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం మనం చూడలేనివి ఏమీ లేనట్లుగానే తెలుస్తోంది. దీంతో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోవడం కూడా అరుదైన విషయమే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వింతల్ని మనం చూడగలుగుతున్నాం. వాటి గురించి చర్చించుకుంటున్నాం.

మనుషుల్ని పోలిన మనుషులు ఉన్నట్లు దేశాలను పోలిన నది కూడా ఉండటం ఓ గొప్ప విషయమే. ఇది చూస్తే మనకు ఆశ్చర్యం వేయక మానదు. అచ్చం చైనాలా పోలి ఉండే ఈ నది అందరిని ముచ్చట గొలుపుతోంది. వినడానికి విచిత్రంగా ఉన్నా చూడటానికి మాత్రం అచ్చం డ్రాగన్ లాగే ఉండటం కూడా ఓ విశేషమే. ఇది ఎక్కడో కాదు పోర్చుగల్ దేశంలోని ఆల్గ్రేవ్ అనే ప్రాంతంలో ఉంది. అచ్చం డ్రాగన్ లా ఉండటంతో దీని పేరు సైతం బ్లూ డ్రాగన్ అని పిలవడం తెలిసిందే.
Also Read: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !
విమానంలో వెళ్తున్న సమయంలో తీసిన ఫొటోతో ఈ నది ఉనికి బయటపడింది. నిజానికి దీనిపేరు ఒడెలైట్ అని పిలుస్తారు. డ్రాగన్ ఆకారంలో ఉండటంతో దీనికి బ్లూ డ్రాగన్ గా పిలవడం తెలుస్తోంది. దీంతో ఒక దేశాన్ని పోలిన నది ఉండటం నిజంగా అద్భుతమే. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుండటం చూస్తున్నాం. కానీ దేశాన్ని పోలీన నది ఉండటంతో అది కూడా సామాజిక మాధ్యమాల ప్రభావంతో వెలుగులోకి రావడంతో అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది.

ప్రకృతి ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. అందులో భాగమే ఈ డ్రాగన్ నది అని తెలుస్తోంది. చుట్టు కొండలు, చెట్ల మధ్య ఈ నది ఉండటం కూడా యాదృచ్చికమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ బ్లూ డ్రాగన్ నదిని చూసేందుకు అందరు ఉత్సుకత వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి పరవశంలో భాగంగా మనం చూసే వింతలు, విశేషాలు మనకు ఎన్నో విషయాల్లో ఉల్లాసం కలిగిస్తుంటాయి. ఇది కూడా అందరికి ఎంతో ఆనందం కలిగించడం తెలిసిందే.
Also Read: తగ్గేదేలే అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు తగ్గినట్టు?