Weight Loss Tips: అధిక బరువు అనేది మనిషి అనారోగ్యానికి ప్రధాన కారణం. మరి ఈ అధిక బరువు తగ్గించుకోవాలి అంటే ఎలా ? బరువు తగ్గాలి అంటే.. ముందు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెడు కొలెస్ట్రాల్ దూరం అవ్వాలి అంటే.. ముందు మనం తీసుకునే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, అధికంగా చేర్చుకోవాలి. సాధారణమైన నీటిని తాగకుండా.. అందుకు బదులుగా జీలకర్ర నానిన నీటిని సేవించడం ద్వారా అధిక బరువుతో కూడిన కండరాలు చాలా ఈజీగా కరిగిపోతాయి.
Also Read: రాజమౌళి పై కేసులు.. ఇది ఆశ్చర్యకరమైన విషయమే !

అలాగే సహజంగా బరువు ను తగ్గించుకోవడానికి కొన్ని సహజ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
1. ముందుగా సొరకాయను వారానికి మూడు సార్లు తినాలి.
2. బొప్పాయిని కూడా తింటూ ఉండాలి.

3. మందార వేళ్లను నీటీలో మరిగించి ఆ నీటిని సేవించడం ద్వారా కూడా బరువును చాలా త్వరగా కోల్పోవచ్చు.
4. లెమన్ గ్రీన్ టీ సేవించడం ద్వారా బరువు తగ్గొచ్చు. ఇది చాలామందికి తెలుసు.
5. మీకు తెలుసా ? అరటి దూటల రసాన్ని సేవించినా బరువు తగ్గుతారు. అలాగే గరిక రసాన్ని సేవించడం ద్వారా కూడా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు.

6. రోజూ ఉసిరి కాయ రసాన్ని సేవించడం ద్వారా బరువును చాలా తేలికగా తగ్గొచ్చు.
7. ఇక వీటితో పాటు ఉదయం పూట అరగంట వాకింగ్ చేసినా మంచి ఫలితం వస్తోంది. పైగా ఇలా చేయడం చాలా మంచిది కూడా. మీరు ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గవచ్చునని ఎందరో ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?