
Watermelon: పుచ్చకాయ చూడటానికి ఎర్రగా ఉంటుంది. తింటే తియ్యగా ఉంటుంది. పోషకాలు గణనీయంగా ఉండటంతో ఎండాకాలంలో పుచ్చకాయ తినడం అందరికి అలవాటుగా ఉండటం సహజం. ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా దీన్ని తీసుకోవాలి. పుచ్చకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సీజన్ లో దొరికే పండ్లు తినడం అలవాటుగా చేసుకుంటే ఎంతో సురక్షితం. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది. పుచ్చకాయను రాత్రి పూట తినకూడదు. ఒక వేళ తింటే కడుపు దెబ్బతింటుంది. పగటి సమయంలోనే దీన్ని తీసుకోవడం ఉత్తమం.
పుచ్చకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటంతో ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. కణాల నిర్మాణం కారణంగా గాయాలు త్వరగా మాయమవుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ స్థాయిలు జుట్టును చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ వంద గ్రాముల పుచ్చకాయలో 6.2 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుందని ఎంత మందికి తెలుసు. పుచ్చకాయంలో ఉండే వాటర్ కంటెంట్, ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగజేస్తుంది.

పుచ్చకాయ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం అక్కర్లేదు. ఇది మన శరీరంలో అధిక కేలరీలను తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే పోషకాలతో గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది. అధిక రక్తపోటును నిరోధిస్తుంది. దీంతో గుండె జబ్బుల ముప్పు రాకుండా నిరోధిస్తుందనడంలో సందేహం లేదు. పుచ్చకాయలో ఉండే సిట్రులినన్ అనే అమైనో ఆమ్లం నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది.
Also Read: Telangana Politics: గవర్నర్ వర్సెస్ చీఫ్ సెక్రెటరీ.. తప్పెవరిది..!?
పుచ్చకాయ తినడం వల్ల లైకోపీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల చిగుళ్లు బలపడతాయి. చెడు బ్యాక్టీరియా నుంచి రక్షించేందుకు రెడీగా ఉంటుంది. దంతాలు తెల్లగా మెరిసేందుకు పరోక్షంగా కారణమవుతుంది. పెదాలు పొడిబారకుండా చేయడంలో అండగా నిలుస్తుంది. దీంతో పుచ్చకాయ తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో మనం ఇదివరకు కూడా తెలుసుకున్నాం.
Also Read: Kavitha Income : 2018లో ఇళ్లే లేదు.. 2023లో ఇరవై లక్షల వాచ్.. కవిత బాగా కష్టపడుతోంది!