
Balagam: కేవలం పెద్ద సినిమాలను మాత్రమే కాదు, చిన్న సినిమాలను కూడా తీసి వాటికి మంచి బజ్ వచ్చేలా చేసి కమర్షియల్ హిట్స్ కొట్టడం ప్రముఖ నిర్మాత దిల్ రాజు కి కొట్టిన పిండి లాంటిది.అలాంటి స్కిల్స్ ఉన్న నిర్మాత కాబట్టే ఈరోజు ఆయన పాన్ ఇండియన్ నిర్మాతగా మారాడు.ఒక పక్క పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ, మరోపక్క ‘బలగం’ లాంటి సినిమాని కూడా నిర్మించాడు.తన కూతురు హర్షిత రెడ్డి ని ఇండస్ట్రీ లో నిర్మాతగా నిలబెడుతూ ఆయన తీసిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
సాధారణంగా ఇలాంటి సినిమాలకు క్రిటిక్స్ రేటింగ్స్ బాగా వస్తుంటాయి కానీ, కలెక్షన్స్ మాత్రం రావు, కానీ దిల్ రాజు ఇలాంటి సినిమాలకు కూడా కలెక్షన్స్ రప్పించే ఎత్తుగడలు చాలానే వేసాడు.విడుదలకి ముందే పలు ప్రాంతాలలో పై ప్రీమియర్ షోస్ వేయించాడు.కంటెంట్ బాగుంది కాబట్టి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
వచ్చిన ఈ పాజిటివ్ రెస్పాన్స్ ని సరైన పద్దతిలో వాడుకుంటూ జనాల్లో ఈ సినిమా కచ్చితంగా చూడాలి అనే ఫీలింగ్ ని రప్పించాడు.అలా విడుదలకు ముందే విపరీతమైన పాజిటివ్ బజ్ తో విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు ఆశించిన స్థాయి ఓపెనింగ్ అయితే దక్కలేదు.దీనితో దిల్ రాజు స్ట్రాటజీ మొట్టమొదటిసారి విఫలం అయ్యింది అనుకున్నారు.కానీ మంచి సినిమా ఇస్తే నెత్తిన పెట్టుకొని ఆదరించే ప్రేక్షకులు ఉన్నంత కాలం ఇలాంటి స్ట్రాటజీలు విఫలం అవ్వవు.మొదటి రోజు పెద్దగా వసూళ్లు రాకపోయినప్పటికీ టాక్ మంచి ఉండడం తో రెండవ రోజు చాలా పుంజుకుంది.

చాలా ప్రాంతాలలో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది, మూడవ రోజు కూడా ఇంతే, అలా మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.ఫుల్ రన్ లో కూడా ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందట.అలా కోటి రూపాయిలకంటే తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఫుల్ రన్ లో ఇంత లాభాలు రాబట్టడం అంటే మామూలు విషయం కాదని చెప్తున్నారు విశ్లేషకులు.