
Telangana Politics: తెలంగాణలో గవర్నర్‌కు, గవర్నమెంట్‌కు మధ్య కొంతకాలంగా గ్యాప్ తగ్గినట్లే అనిపించినా అది నివురుగప్పిన నిప్పు అన్న విశయం తాజాగా బయట పడింది. ఆరు నెలలుగా పది బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపడం లేదు. తిప్పి పపండం లేదు. ఆ బిల్లులను తనవద్ద పెండింగ్‌లో పెట్టుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలుపుతారో లేదో అన్న అనుమానం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వచ్చింది. దీంతో జనవరి 27న గవర్నమెంట్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తుందా అని ప్రశ్నించింది. దీంతో వ్యవహారం బెడిసి కొట్టేలా ఉందని భావించిన ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి పిటిషన్ ఉప సంహరించుకుంది.
Also Read: MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? షాకింగ్ పరిణామాలు
తాజాగా కొత్త సీఎస్‌తో పిటిషన్..
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గవర్నర్ ప్రసంగంతోనే ఈ సమావేశాలు మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్‌ను అసెంబ్లీకి తీసుకొచ్చారు. గవర్నర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్నే యథావిధిగా చదివారు. దీంతో ఇక రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య వివాదం సమసిపోయినట్లే అని అంతా భావించారు. కానీ, తాజాగా కేసీఆర్ సర్కార్ పెండిగ్ బిల్లులు ఆమోదం కోసం సుప్రీం కోర్టులో చీఫ్ సెక్రెటరీ శాంతికుమారితో పిటిషన్ వేయించింది. పది బిల్లులను ఆరు నెలలుగా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని, ఇది రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. గవర్నర్ ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలని కానీ, స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు హోలీ సెలవుల తర్వాత విచారణ జరుపుతామని ప్రకటించింది.

11 వేళ ఫైళ్లు పెండింగ్‌లో..
తెలంగాణలో గడిచిన తొమ్మిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ 11 వేల ఫైళ్లను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో అనేక కీలక ఫైళ్లు ఉన్నాయి. అయినా కేసీఆర్ వాటిని క్లియర్ చేయడం లేదు. రాజకీయం ప్రాధాన్యం, తన ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చే ఫైళ్లకు మాత్రమే కేసీఆర్ క్లియరెన్స్ ఇస్తున్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులు ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. కోర్టు కూడా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించింది. అయినా తెలంగాణ సర్కార్ దీనిని అమలు చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును అమలు చేసి 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చింది. విద్యుత్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఆర్టీసీ ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, పోడు పట్టాల ఫైల్ ఇలా 11 వేల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి గురించి నోరు మెదపని సీఎస్ శాంతికుమార్, సీఎం కేసీఆర్ కేవలం ఆరు నెలలుగా 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అధికారిక సైట్‌లో కనిపించని 150 జీవోలు..
ఫైళ్ల పెండింగ్ అటుందచితే వివిధ అంశాలపై ప్రభుత్వం జారీ చేసే జీవోలను కూడా ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచుతుంది. గడిచిన 9 ఏళ్లలో 150 జీవోలను రహస్యంగా ఉంచింది. ప్రభుత్వం ఏ జీవో జారీచేసినా దానిని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. గత ప్రభుత్వాలు ఈ సంప్రదాయం పాటించాయి. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాత్రం సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు నచ్చే జీవోలను మాత్రమే వెబ్‌సైట్‌లో ఉంచుతున్నారు. తన ప్రయోజనాల కోసం, ప్రజాప్రతినిధుల ప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనాల కోసం జారీ చేసే జీవోలను మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చినా.. దీనిపై కూడా కేసీఆర్ స్పందన లేదు.
గవర్నర్ తప్పు చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని, స్వతంత్రగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ సూచన మేరకు పని చేయడం లేదని ఆరోపిస్తున్న సర్కార్ మరి తాను 11 వేల ఫైళ్లు పెండింగ్‌లో పెట్టినందుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. 10 బిల్లులకు గవర్నర్‌ను తప్పు పడుతున్న కేసీఆర సర్కార్‌ను 11 వేళ ఫైళ్లు పెండింగ్‌లో పెట్టినందుకు ఎన్నిసార్లు తప్పు పట్టాలి, కేసీఆర్‌పై ఎలాంటి చర్య తీసుకోవాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Also Read: Chanakya Niti: మనం ఎవరినైనా నమ్మే ముందు ఇవి పాటించాలి