https://oktelugu.com/

cow : అసలు ఆవుకు ఆహారం ఎందుకు పెట్టాలో తెలుసా?

కార్తీక మాసం మొత్తం చాలా పూజలు చేస్తారు. టెంపుల్స్ కు వెళ్తుంటారు. తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎక్కువగా వెళ్తుంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 5, 2024 / 08:28 AM IST

    cow

    Follow us on

    cow : కార్తీక మాసం మొత్తం చాలా పూజలు చేస్తారు. టెంపుల్స్ కు వెళ్తుంటారు. తీర్థ యాత్రలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఎక్కువగా వెళ్తుంటారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఎక్కువమంది గోవులకు పూజలు చేస్తుంటారు కూడా. ఈ కార్తీక మాసంలో మాత్రమే కాదు గోవులకు ఎప్పుడైనా పూజ చేస్తుంటారు చాలా మంది. సంవత్సరం అంతా గోవులను పూజించేవారు కూడా ఉంటారు. ఇలా చేస్తే పుణ్యం వస్తుందని పాపాలు తొలగిపోతాయని అంటున్నారు పండితులు.

    కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వేలాదిమంది భక్తులు నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానానికి వెళ్లారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామివారి ముఖ ద్వారం వద్ద జ్యోతులను వెలిగించారు. ఆ కార్యక్రమం తర్వాత భక్తులు అందరూ మల్లమ్మ కన్నీరు వద్దకు వెళ్లారు. మల్లమ్మ కన్నీరు ప్రాంతంలో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి వద్ద ఓ ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇక్కడ దేవస్థానానికి సంబంధించిన ఆవులు వేల సంఖ్యలో అక్కడ ఉంటాయి. అందులో కొన్ని ఆవులను ప్రత్యేకంగా మల్లమ్మ కన్నీరు గుడికి ఎదురుగా వాటిని ప్రత్యేకంగా భక్తుల కోసం ఒక ఆరు ఆవులను ఏర్పాటు చేస్తారు. మల్లమ్మ దర్శనం తర్వాత భక్తులు ఆవులకు సపరేటుగా గ్రాసం ఏర్పాటు చేశారు.

    పచ్చి గడ్డిని ఏర్పాటు చేసి ఆవులకు మేతగా వేశారు. ఇలా పచ్చి గడ్డిని ఆహారంగా ఇవ్వడంతో పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటాయి. ఈ విషయాన్ని మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు మనం ఏ దేవతను తలుచుకొని గోవుకు ఆహారం పెట్టినా సరే ఆ దేవతకు ఆహారం అందించినట్లు అంటారు అర్చకులు. అయితే ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకునికి పూజ చేయడం ఆనవాయితీ. వినాయకుని పూజ తర్వాత గోమాతకు పూజ చేస్తే అన్ని శుభాలు జరుగుతాయి అంటున్నారు పండితులు.

    గృహప్రవేశం ఉంటే కూడా ముందుగా ఇంట్లోకి ఆవును పంపిస్తారు. అది హిందూ సంప్రదాయ పద్ధతిగా, పురాతన ఆచార్య పద్ధతులుగా పాటిస్తున్నారు. ఇల్లు కట్టినప్పుడు పలు రకాల వ్యక్తులు ఇళ్లలోకి వస్తారు. అందుకే ఆ ఇంటిని శుద్ధి చేయాలంటే ఇల్లు పూర్తిగా కట్టిన తర్వాత గోమాతను తీసుకొని వెళ్లాలి అంటారు. ఆవు నడిచి వస్తే సాక్షాత్తు ఆ పరమ మహా శివుడే నడిచి వచ్చినట్టు అంటారు. అందుకే కార్తీక మాసంలోనే కాకుండా ఇప్పుడైనా సరే మనం గోవుకు ఆహార పదార్థాలను అందించాలి అంటున్నారు పండితులు. అయితే ఆవులకు ఆహారం పెట్టడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది అంటున్నారు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అర్చకులు.