Tollywood hero : ఆ హీరో కెరీర్ స్టార్ చేసి పదేళ్లు అవుతుంది. కానీ ఒక్క హిట్టు కూడా పడలేదు. సినిమా కోసం ఎంతైనా కష్ట పడాలి అనుకున్నాడు. కష్టపడ్డాడు. కానీ ఫలితం లేదు. ఆస్తులు మాత్రం వందల కోట్లు సంపాదించాడు ఆ హీరో. తండ్రి బడా ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ హిట్లు లేక పెళ్లి బాట పట్టారు ఆ హీరో. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా?
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ బాబు గురించి మీకు తెలిసిందే. ఈ ప్రొడ్యూసర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీనియర్ హీరోలతో పాటు దాదాపు స్టార్ హీరోలందరితో ఈ ప్రొడ్యూసర్ సినిమాలు చేశారు. ఆయన వారసులిద్దరు ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. కానీ హిట్ లు మాత్రం లేవు. అయితే సురేష్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శ్రీను సినిమా గుర్తుందా మీకు. ఈ సినిమాతో తెరంగ్రేటం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ యావరేజ్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత ‘స్పీడున్నోడు’ వంటి కాన్సెప్ట్ సినిమాతో వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ ఫలితాలను అందుకుంది. ఇక మూడో సినిమాకు ఏకంగా బోయపాటితో ‘జయ జానకి నాయక’ మూవీతో పలకరించారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్రలో నటించారు ఈ హీరో. టీజర్, ట్రైలర్‌లతో ఓ ఊపు ఊపింది సినిమా. థియేటర్‌లలో కూడా అదే టాక్ ను సంపాదించింది. ఇక యాక్షన్ సీన్లు అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ఫైట్ సీన్లను చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్.
అయితే ఈ హీరో నటించిన రక్షకుడు సినిమా మాత్రం మంచి హిట్టు సంపాదించింది. అంతేకాదు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాలకు మిలియన్లలో వ్యూస్ వచ్చి పడ్డాయి. సీతా, కవచం, సాక్ష్యం, స్పీడున్నోడు వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించి హిట్ ను కొట్టి వ్యూస్ ను సంపాదించారు. ఇక ఈ సినిమాల గురించి పక్కన పెడితే శ్రీనివాస్‌కు వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో మంచి పేరుంది.
తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే పాజిటివ్ గానే తీసుకునే మెంటాలిటీ ఉంది. ఇక సినీ కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. అందుకే పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ విషయాన్ని ఏకంగా బెల్లం కొండ సురేష్ తెలిపారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు అక్షరాల రూ.250 కోట్ల ఆస్తి ఉందని టాక్. తండ్రి ఆస్తులు ఈయన ఆస్తులు కలిపి ఎక్కువగానే ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా బెల్లంకొండకు ఎలాంటి ఫలితాలను సంపాదించి పెడుతుందో చూడాలి.