
After Marriage Gain Weight : పెళ్లి చేసుకునే జంటలు చూడముచ్చటగా ఉంటారు. వారి అందం అందరికి దిష్టి పెడుతుందని అంటుంటారు. అలా వివాహంలో సన్నగా కనిపించే జంటలు కొన్ని పెళ్లయ్యాక లావు పెరుగుతుంటారు. దీంతో వారిని చూడాలంటే చూడబుద్ధి కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది. వారు ఎందుకు లావవుతున్నారు. పెళ్లిలో ఉంటే నాజూకుతనం ఎటు పోతుంది. వారు బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. వివాహమనే తంతుతో దంపతులుగా మారుతున్నారు. కొత్తగా పెళ్లయ్యాక తరువాత జరిగే కార్యక్రమాలే వారిని లావు చేస్తున్నాయి. ఫలితంగా వారి బరువు వారికే భయం కలిగిస్తుంటుంది. ఈ నేపథ్యంలో తమను తాము చూసుకుని బాధపడుతుంటారు. దంపతులు బరువు పెరగడానికి కారణాలేంటో ఓసారి చూద్దాం.
పెళ్లి పనుల్లో బిజీ
పెళ్లి చేసుకునే జంటలు పెళ్లి పనుల్లో సందడిగా గడుపుతుంటారు. అంతకు ముందు వాకింగ్ చేస్తూ కాస్త ఒళ్లును కంట్రోల్ లో పెట్టుకుంటారు. ఇక పెళ్లి పెట్టుకున్నాక వాకింగ్ మానేసి ఈ పనుల్లోనే బిజీగా ఉంటారు. పెళ్లి పనులు ప్రారంభమైన నాటి నుంచి ఏవో పనుల్లో తిరుగుతుంటారు. దీంతో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోరు. ఫలితంగానే లావు అవుతుంటారు. నెల రోజుల పాటు పలు కార్యక్రమాలతో సందడిగా గడుపుతుంటారు. ఇందులో భాగంగానే లావెక్కి కొంచెం బొద్దుగా కనిపించడం సహజమే.
వంటకాల సందడి
పెళ్లంటేనే ఇల్లంతా బంధువుల సందడి ఉంటుంది. రకరకాల పిండి వంటలు చేస్తుంటారు. అన్ని కాబోయే వధూవరులకు రుచి చూపిస్తుంటారు. ఇలా అన్నింటిని రుచి చూసే నెపంతో కాస్త లాగిస్తుంటారు. అన్ని కలిపి తినడం వల్ల కూడా కాస్త బరువు పెరడం మామూలే. పదార్థాల్లో నెయ్యి, పంచదార, నూనె, ఉప్పు లాంటివి మంచి మోతాదులోనే వేస్తారు. వాటిని తినడం మూలంగా ఒళ్లు చేస్తుంటారు. ఇలా దంపతులు కొత్తగా పెళ్లయ్యాక బరువులో తేడాలు రావడం చూస్తుంటాం.

విందుల గోల
పెళ్లయ్యాక కొత్త జంటను అందరు తమ ఇళ్లల్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా పిలిచి వారికి విందులు ఇస్తుంటారు. ఇందులో చికెన్, మటన్, ఫిష్ ఏవేవో వంటలు చేసి తినిపిస్తారు. ఇలా కొత్త జంట తిండి విషయంలో అశ్రద్ధ చేయడం వల్ల బరువు పెరుగుతుంటారు. దీని వల్ల శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుతో కనిపిస్తారు. ఎక్కువ సేపు కూర్చోవడం, నడక కొనసాగించకపవడం వంటి కారణాలతో కూడా బరువు పెరిగేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. వ్యాయామాలు కూడా చేయరు. ఇది కూడా ఒక మైనస్సే.
నిద్ర లేకపోవడం
పెళ్లి పనుల్లో పడి హడావిడి పెరుగుతుంది. పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. సరైన నిద్ర కూడా ఉండదు. దీంతో అలసట, ఒత్తిడి కూడా బరువు పెరిగేందుకు కారణాలవుతాయి. సంగీత్ వేడుకలు, మెహందీ, హల్దీ అంటూ రకరకాల కార్యక్రమాలతో అర్థరాత్రి వరకు మేల్కొనే ఉంటారు. నిద్రలేమితో చాలా మంది బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. నూతన దంపతులు బరువు పెరగడానికి ఇలా ఎన్నో కారణాలు మనకు కనిపిస్తాయి. కానీ తరువాత కొందరు తగ్గుతారు. కొందరు మాత్రం అలాగే పెరుగుతారు.