https://oktelugu.com/

Celebrities: సెలబ్రెటీలు ఐస్ బాత్ ఎందుకు చేస్తారో తెలుసా?

ఉదయం లేచిన తర్వాత వాకింగ్, జాగింగ్, వ్యాయామం, యోగా అంటూ రోజులో చాలా సమయం కేటాయిస్తారు సెలబ్రెటీలు. ఇక వారి ఆరోగ్య అలవాట్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : April 5, 2024 / 01:42 PM IST

    Why celebrities take ice baths

    Follow us on

    Celebrities: సెలబ్రెటీల అలవాట్లు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారి జీవితం మొత్తంలో ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పడుతుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వారకు చాలా విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా విషయాలు అందరికీ తెలిసినవే కానీ ఈ ఐస్ బాత్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు ఐస్ బాత్ ట్రెండ్ నడుస్తోంది. ఇంతకీ సెలబ్రెటీలు ఎందుకు ఈ ఐస్ బాత్ ను చేస్తారు? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.

    ఉదయం లేచిన తర్వాత వాకింగ్, జాగింగ్, వ్యాయామం, యోగా అంటూ రోజులో చాలా సమయం కేటాయిస్తారు సెలబ్రెటీలు. ఇక వారి ఆరోగ్య అలవాట్లు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. పూర్తి డైట్ ను మెయింటెన్ చేస్తుంటారు. ఇందుకోసం డైట్ ఫ్లానర్ లను కూడా నియమించుకుంటారు. ఇక సెలబ్రెటీలు ఈ మధ్య ఎక్కువ ఐస్ బాత్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా సేదతీరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. మరి ఈ ఐస్ బాత్ ను ఎందుకు చేస్తారో తెలిస్తే మీకు నియర్ బై ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది.

    ఐస్ బాత్ చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందట. దీని వల్ల శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాదు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది ఐస్ బాత్. మెదడుకు పదును పెడుతుంది అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఐస్ బాత్ వల్ల సులభంగా బరువు తగ్గొచ్చట. రక్త ప్రసరణను కూడా పెంచుతుందట. ఒత్తిడిని తగ్గించడంలో నెంబర్ వన్ గా పనిచేస్తుంది. ఇక తిమ్మిర్ల సమస్యలు ఉన్నావారికి ఐస్ బాత్ ఉపశమనం కలిగిస్తుంది.

    చూశారు కదా ఐస్ బాత్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. సమయం వృధా అయినా పర్వాలేదు కానీ సెలబ్రెటీలు మాత్రం కచ్చితంగా ఇలాంటి వాటికోసం వారి డైలీ లైఫ్ లో సమయం కేటాయిస్తారు. దీనివల్ల ఆరోగ్యం, అందం వారి సొంతం అవుతుంటుంది. మరి మీరు కూడా కుదిరితే ఓ సారి ట్రై చేయండి.