Allergies: చలికాలంలో అలర్జీల బెడద ఉంటుంది. దగ్గు, జలుబు సమస్యతో కొట్టుమిట్టాడుతుంటారు. వీటి కారణంగా బాధపడుతుంటారు. శీతాకాలంలో చలి నుంచి వచ్చే ముప్పే ఎక్కువ. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా చల్లగాలి కూడా మనకు కొన్ని రకాల వ్యాధులు కలగజేస్తుంది. ఇన్ఫెక్షన్లతో కూడా ఎంతో నష్టం ఉంటుంది. వెరసి మనకు చలికాలంలో వ్యాధుల గోలతో సతమతమవుతుంటాం. చల్లగాలితోనే ఎక్కువగా రొంప వంటి రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలో చలికాలం జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే వ్యాధులు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది.

ఇంకా ఈ కాలంలో మనం కప్పుకునే దుప్పట్లతో కూడా సమస్యలు పెరుగుతాయి. ఇందులో ఉండే దుమ్ము, ధూళితో తవిటి పురుగులు ఎక్కువగా వృద్ధి చెందుతాయి దీంతో అలర్జీల ప్రభావం ఉంటుంది. చలిగాలి, కాలుష్యం, పొగమంచుతో పాటు తవిటి పురుగుల బారిన పడుతుండంతో మనకు ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో చలికాలంలో రోగాల నుంచి ఉపశమనం పొందడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వ్యాధులు మనల్ని ఇబ్బందుల పాలు చేయడం సహజమే. ఇలా శీతాకాలంలో పరిశుభ్రత పాటించకపోతే అంతే సంగతి.
చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్ కలిగినా సమస్యలు వస్తాయి. చలికాలంలో చల్లగాలులు కామనే. వీటితో కూడా మనకు అనేక రోగాల ముప్పు ఏర్పడుతుంది. ముక్కుకారడం ఓ ప్రధాన సమస్యగా మారుతుంది. అలర్జీకి కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. అప్పుడే మనకు రక్షణ వ్యవస్థ సహకరిస్తుంది. కాలుష్యం వల్ల మనకు దీర్ఘకాల జబ్బులు వచ్చే వీలుంటుంది. అందుకే చలికాలంలో అన్నింటి బారి నుంచి రక్షించుకునేందుకు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

అలర్జీ వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. దీంతో సైడ్ ఎఫెక్టులు కూడా వస్తాయి. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని నియంత్రణలో ఉంచేందుకు రకరకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కువగా చలిలో తిరగకూడదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెత్తికి టోపీ ధరించాలి. ముక్కుకు కర్చీఫ్ కట్టుకోవాలి. ఒంటికి స్వెటర్ వేసుకోవాలి. ఇలా రక్షణ చర్యలు తీసుకుని చలికాలంలో శరీరాన్ని కాపాడుకోవాలి. అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది.