Best Savings Schemes: నేటి కాలంలో చాలా మందికి ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయి. దీంతో సేవింగ్ చేయడానికి డబ్బులు ఉండడం లేదు. ఇలాంటి తరుణంలో తక్కువ మొత్తంలో సేవింగ్ చేసుకుంటూ పోతే భవిష్యత్ లో భారీగా ఆదాయం వచ్చే ఎన్నో పథకాలు ఉన్నాయి. చాలా మంది తక్కువ వ్యవధిలోనే అధిక లాభం వచ్చే స్కీమ్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కానీ వీటిల్లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పైగా మిగతా ఖర్చుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అందువల్ల తక్కవ మొత్తంలో సేవింగ్స్ చేసుకుంటూ పోవడం వల్ల కనీసం 5 ఏళ్లకు ఊహించిన వడ్డీ రేటు ఉంటుంది. మరి అలా అధికంగా వడ్డీ ఇచ్చే పథకాల గురించి తెలుసుకుందాం..
పోస్టాపీసు ద్వారా అనేక పొదుపు మొత్తాల స్కీమ్స్ ఉన్నాయి. నేటి కాలానికి అనుగుణంగా ఇవి కూడా అప్ గ్రేడ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది National Saving Certificate ఒకటి. ఇందులో తక్కవ మొత్తంలో అంటే కనీసం వెయ్యి నుంచి 5 వేల లోపు పెట్టుబడులు పెడుతూ 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయడం వల్ల 7 నుంచి 7.7 శాతం వరకు వడ్డీ వవస్తుంది. ఒక వేళ 5 సంవత్సరాల తరువాత 8శాతం వడ్డీ వచ్చినా రావొచ్చు.
కొంత మంది ఉద్యోగులు జీవితాంతం పనిచేస్తారు. ఇన్ని రోజులు ఎంత కూడబెట్టారు? అని కొందరు అడిగితే ఇల్లు ఒక్కటే చూపిస్తారు. వారి ఖర్చుల కోసం కుమారులు, కూతుళ్లపై ఆధారపడుతారు. అయితే సొంతంగా వారు ఖర్చులు పెట్టుకునేందుకు ఇప్పటి నుంచే ‘సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్’లో మీరు అనవసరంగా పెట్టే ఖర్చులకు సంబంధించిన డబ్బును ఆదా చేసుకుంటూ నిర్ణీత గడువు నిర్ణయించుకుంటే వీటిపై 8.2 శాతం వడ్డీని చెల్లిస్తారు.
పోస్టాపీసుల్లో మంత్లీ సేవింగ్స్ ద్వారా కూడా అధిక వడ్డీని పొందవచ్చు. నెలకు మిగులు ఆదాయాన్ని పొదుపు చేసుకుంటూ పోవడం వల్ల 7.4 శాతం వడ్డీని చెల్లిస్లారు. ఇక అందరికీ తెలిసిన సుకన్య సమృద్ధిలోనూ ఇప్పుడు భారీగానే వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ పథకంలో సంవత్సరానికి 8 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. ఈ పథకంలో కనీసం రూ.250 నుంచి డిపాజిట్ చేసుకుంటూ పోవచ్చు. ఇలా పెద్దగా భారం పడకుండా తక్కువ మొత్తంలో సేవింగ్స్ చేయడం ద్వారా మనకు తెలియకుండానే ఇవి జమ అవడంతో పాటు భారీగా రిటర్న్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.