Loans: నేటి కాలంలో ఎంత సంపాదించినా ఖర్చులకు సరిపోవడం లేదు. వస్తువుల ధరలు పెరిగిపోవడంతో పాటు అనుకోని వ్యయాలు రావడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి వైద్య ఖర్చులు, బిల్లుల చెల్లింపులు చేయడానికి చేతిలో డబ్బు ఉండదు. దీంతో ఇతరుల వద్ద అప్పు తీసుకోవడానికి రెడీ అవుతారు. కరోనా తరువాత అప్పులు ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. కానీ బ్యాంకులు మాత్రం క్రెడిట్ కార్డుల రూపంలో ఆదాయన్ని అవసరానికి అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డులపై వస్తుసేవల కోసం ఖర్చుపెట్టుకున్నా.. తక్కువ సమయంలోనే చెల్లించాలి. ఒకవేళ ఈఎంఐలోకి మార్చుకున్నా.. వడ్డీ బాగానే పడుతుంది. ఈ క్రమంలో అత్యవసరంలోనూ తక్కువ వడ్డీ ఇచ్చే రుణాల కోసం ఎదురు చూసేవారికి ఈ మార్గాలు బెస్ట్ అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే?
బంగారు రుణాలు:
పెళ్లిళ్ల సమయంలో, ఇతర శుభకార్యాల సందర్భంగా చాలా మంది బంగరు ఆభరణాలు చేయించుకుంటారు. కానీ సాధారణ సమయంలో వీటిని స్టోర్ చేస్తారు. ఒకప్పుడు కొందరు వ్యక్తులు బంగారం తాకట్టుపెట్టుకొని అప్పు ఇచ్చేవారు. కానీ వడ్డీ బాగానే వసూలు చేసేవారు. కానీ బ్యాంకులు మాత్రం బంగారంపై తక్కువ వడ్డీ అంటే ని వసూలు చేస్తాయి. బంగారంపై తీసుకున్న రుణాన్ని ఏ మేరకు టెన్యూర్ పెట్టుకుంటున్నారో దానిపై వడ్డీని లెక్కిస్తారు. ఏడాది పాటు కాలపరిమితిని పెట్టుకుంటే 9 నుంచి 27 శాతం వడ్డీరేట్లను నిర్ణయిస్తారు. అయితే స్వచ్ఛమైన బంగారాన్ని తూకం వేసి దానిపై 75 శాతం మాత్రమే రుణాలను అందిస్తారు.
పర్సనల్ లోన్స్:
బ్యాంకు వ్యవహారాలు చక్కగా నిర్వహించే ఖాతాదారుడికి సిబిల్ స్కోర్ హై రేంజ్ లో ఉంటుంది. దీనిని భట్టి కొన్ని బ్యాంకులు పిలిచి మరీ రుణాలు ఇస్తాయి. మిగతా రుణాల కంటే సాలరీ బేస్ చేసుకొని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రుణాలపై 10.5 శాతం వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు 24 శాతం వరకు చార్జి చేస్తాయి. క్రెడిట్ స్కోరు బాగుంటే మరింత తక్కువ వడ్డీ పడే అవకాశం ఉంది. ఈ లోన్ రావడానికి పెద్దగా సమయం పట్టదు. మొత్తం కలిసి గంటలో రుణ మొత్తాన్ని అందిస్తారు.
ఈ రుణాలపై వడ్డీ రేటు తక్కువ విధించినా కొన్ని నిబంధనలు జాగ్రత్తలు పాటించారు.బంగారంపై తీసుకున్న రుణాలు ముందే చెల్లించాలనుకుంటే కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. ఆ విషయాన్ని ముందుగానే అడిగి రుణం తీసుకోవడం మంచిది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఉండదు. బంగారంపై తీసుకున్న రుణాలను ఎప్పుడైనా చెల్లించవచ్చు. వ్యక్తిగత లోన్ల విషయంలో కొన్ని బ్యాంకులుఇలాగే ప్రవర్తిస్తాయి. అందువల్ల ముందు అన్నీ విషయాలు పరిశీలించాకే రుణం తీసుకోవాలి.