Credit Cards: అత్యధిక డిస్కౌంట్లు.. ఛార్జీలు లేని క్రెడిట్ కార్డులు ఏవో తెలుసా?

యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ గా ఇస్తోంది. ఈ కార్డు ద్వారా స్విగ్గీ కొనుగోలు చేస్తే ఒక్కో ఆర్డర్ పై రూ.120 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ నెలకు రెండు సార్లు వర్తిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : November 24, 2023 6:17 pm

Credit Cards

Follow us on

Credit Cards: ఒకప్పుడు క్రెడిట్ కార్డు కొందరికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సామాన్యుల చేతిలో పదుల కొద్ది క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. బ్యాంకు ట్రాన్సాక్సన్, వారి ఆదాయాన్ని భట్టి బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. చాలా మందికి క్రెడిట్ కార్డుల వల్ల ఎంతో ఉపయోగం ఉంటోంది. కానీ కొందరు క్రెడిట్ కార్డును విపరీతంగా వాడి ఆ బిల్లును చెల్లించేటప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లుతో పాటు అదనపు చార్జీలు పడుతున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను లైఫ్ టైం ఫ్రీగా జారీ చేస్తున్నాయి. అలాగే కొన్ని కార్డులపై బెన్ పిట్స్ ను అందిస్తున్నాయి.

యాక్సిస్ బ్యాంక్: యాక్సిస్ బ్యాంకు ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ గా ఇస్తోంది. ఈ కార్డు ద్వారా స్విగ్గీ కొనుగోలు చేస్తే ఒక్కో ఆర్డర్ పై రూ.120 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ నెలకు రెండు సార్లు వర్తిస్తుంది. అలాగే ప్రతి రూ.200 పై 4 హెడ్జ్ రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు అమెజాన్ కో బ్రాండ్ అనే కార్డుపై ఎలాంటి వార్షిక రుసుమును జారీ చేయడం లేదు. ఈ కార్డుతో అమెజాన్ కొనుగోలు దారులకు 5 శాతం, నాన్ ప్రైమ్ మెంబర్స్ కు 3 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంకు ప్లాటినం కార్డు ద్వారా ఇంధనం మినహా అన్ని రిటైల్ కొనుగోళ్లపై రూ.100 ఖర్చుపై 2 రివార్డు పాయింట్స్ వస్తాయి. రూ.500 నుంచి రూ.3 వేల వరకు ఇందన కొనుగోలళ్లపై 1 శఆతం మినహాయింపు ఉంటుంది. ఐఆర్సిటీసీ పై చేసే లావాదేవీలపై 1.8 శాతం పొందవచ్చు.

కొటక్ మహీంద్రా బ్యాంకు ఫార్చూన్ గోల్డ్ ద్వారా కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డుకు ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. అలాగే ఈ కార్డు ద్వారా ఇంధనంపై చేసే ఖర్చుపై సంవత్సరంలో రూ.3,500 వరకు రాయితీని పొందవచ్చు. షాపర్స్ స్టాప్ హెచ్ డీఎఫ్ సీ కార్డును జారీ చేస్తోంది. దీనిపై ఇంధనం మినహా ఇతర కేటగిరీలు, బ్రాండ్ లు కొనుగోలు చేస్తే ప్రతీసారి రూ.150 ఫస్ట్ సిటిజన్ పాయింట్లు పొందవచ్చు. ఇవి గరిష్టంగా నెలలో రూ.500 వరకు పొందవచ్చు.