Mithun Chakraborty: జీవితం అంటే పూలపాన్పు కాదు. లక్ష్యాన్ని చేరడానికి ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. అయితే ఈ కష్టంలో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు కొంచెం కష్టపడితే అత్యున్నత శిఖరాలకు చేరుతారు. మరికొందరు ముళ్ల కంపలపై నడిస్తే గానీ.. అనుకున్న జీవితాన్ని పొందలేరు. ఇలాంటి జీవితాలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారివి ఎక్కువగా ఉంటాయి. గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు కోసం ఎంతో మంది ఆరాట పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కొందరు ఆ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగి.. ఆ తరువాత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయితే ఓ స్టార్ హీరో తన పాత రోజుల్లో కనీసం తిండి కూడా దొరకని రోజులు గడిపానని అంటున్నారు. ఒక్కపూట అయినా భోజనం దొరికితే చాలు.. అని అనుకున్న పరిస్థితి నుంచి ఇప్పుడు స్టార్ రేంజ్ లో కొనసాగుతున్నారు.ఆయన జీవితం గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి.
ప్రతీ పెళ్లి భారత్ లో ఒకప్పుడు ‘ఐయామ ఏ డిస్కో డ్యాన్సర్’ అనే పాట కచ్చితంగా వినిపించేది. పబ్బుల్లో అయితే ఈ పాట లేకుండా ఉండదు. ఈ సాంగ్ లో కుర్రాళ్లకు మంచి జోష్ నింపేలా నటించారు మిథున్ చక్రవర్తి. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు ఉన్న మిథున్ చక్రవర్తి ఒకప్పుడు బంపర్ హిట్టు సినిమాలు చేశారు. మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన ‘మృగయ’ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఆయన ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువత సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ఫ్యార్ ఝుక్తా వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. తెలుగులోనూ ఆయన ‘గోపాల గోపాల’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
మిథున్ చక్రవర్తి జీవితం మిగతా వారికంటే భిన్నంగా ఉండేది. తన చిన్ననాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఓ షోలో ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు అనుభవించిన కఠిన జీవితం గురించి చెప్పాడు. ఆకలి కేకలతో ఎన్నో రోజులు పస్తులుండాల్సి వచ్చిందని తెలిపాడు. నిద్రపోయే ముందు కాస్త తిండి దొరికితే బాగుండు.. అని అనుకునేవాడు. ఇలా చాలా సార్లు తిండి లేక ఫుట్ ఫాత్ లపై పడుకున్న రోజులు ఉన్నాయని అన్నారు.
అయితే కొన్నాళ్ల తరువాత సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న కోరకతో అక్కడక్కడా డ్యాన్స్ లు చేసేవారు. ఒక వైపు అవకాశం దొరికిన చోట డ్యాన్సులు చేస్తూ .. మరోవైపు తిండి కోసం ఏ పని దొరికినా చేసేవాడిని అని చెప్పాడు. అలా కొన్నాళ్ల తరువాత సినిమాల్లోకి అవకాశం వచ్చింది. అయితే హీరో అవ్వాలన్న కోరిక ఎప్పుడు ఉండేది కాదు. అందుకే విలన్ పాత్రలను చాలా ఇంట్రెస్టుగా చేసేవాడు. అయితే యూత్ కు మాత్రం మిథున్ చక్రవర్తి ఓ మెసెజ్ చెప్పాడు. ప్రతి ఒక్కరి జీవితం కష్టంగానే ఉంటుందని అనుకోవాలి. చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని ముగించరాదని సలహా ఇస్తున్నాడు.