https://oktelugu.com/

Lucky Color: ఏ రాశి వారికి ఏ రంగు వాహనం బాగుంటుందో తెలుసా?

Lucky Color: మనదేశంలో జ్యోతిష్యానికి ఎక్కువ విలువ ఇస్తాం. మనం ఏది కావాలన్నా పంచాంగం చూసుకోవడం సహజం. ఇల్లు కట్టుకోవాలన్నా వివాహం చేసుకోవాలన్నా ఆఖరుకు వాహనం కొనాలన్నా రంగులు చూసుకోవాల్సిందే. ఏ రాశి వారికి ఏ కలర్ బాగుంటుందో కూడా జ్యోతిష్యమే చెబుతుంది. దీంతో మనకు కావాల్సిన కలర్లను ఎంచుకోవడం మనమీదే ఆధారపడి ఉన్నా కలర్ ను ఎన్నుకోవడం పంచాంగం మీదే తెలుస్తుంది. ఏ రాశి వారికి ఏ కలర్ మంచిదో చెబుతుంటారు. మేష రాశి వారు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 14, 2022 / 05:40 PM IST
    Follow us on

    Lucky Color: మనదేశంలో జ్యోతిష్యానికి ఎక్కువ విలువ ఇస్తాం. మనం ఏది కావాలన్నా పంచాంగం చూసుకోవడం సహజం. ఇల్లు కట్టుకోవాలన్నా వివాహం చేసుకోవాలన్నా ఆఖరుకు వాహనం కొనాలన్నా రంగులు చూసుకోవాల్సిందే. ఏ రాశి వారికి ఏ కలర్ బాగుంటుందో కూడా జ్యోతిష్యమే చెబుతుంది. దీంతో మనకు కావాల్సిన కలర్లను ఎంచుకోవడం మనమీదే ఆధారపడి ఉన్నా కలర్ ను ఎన్నుకోవడం పంచాంగం మీదే తెలుస్తుంది. ఏ రాశి వారికి ఏ కలర్ మంచిదో చెబుతుంటారు.

    Lucky Color

    మేష రాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించేందుకు వెనకాడరు. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించరు. వీరికి ఎరుపు, పసుపు, కుంకుమ, నారింజ రంగులు బాగుంటాయి. కారు కొనాలనుకుంటే ఈ కలర్లలో తీసుకుంటే వారికి మంచి జరుగుతుంది. నచ్చిన కలర్ తీసుకుంటే మనకు మనపై విశ్వాసం కూడా పెరుగుతుంది. కారు కొనే ముందు జాగ్రత్తలు తీసుకుని మన ఇష్టమైన కలర్లను ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

    వృషభ రాశి వారు జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకుంటారు. చేసే పనిలో నేర్పరితనం ప్రదర్శిస్తుంటారు. పనులు చేయడంలో ఉత్సుకత ఉండేలా చూసుకుంటారు. వీరికి తెలుపు, ఆకుపచ్చ రంగులు బాగుంటాయి. వీరు తమ కారు కొనుగోలు చేసేటప్పుడు ఈ కలర్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారు తెలివైన వారుగా ఉంటారు. వీరికి ఎరుపు, ఆకుపచ్చ, బూడిద రంగులు బాగుంటాయి. దీంతో వీరు కారు కొనుక్కోవాలనుకుంటే ఈ కలర్లు తీసుకుంటే మంచి జరుగుతుంది.

    Lucky Color

    కర్కాటక రాశి వారు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశి వారికి ఎరుపు, పసుపు రంగులు మంచివి. దీంతో వీరు వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటే ఈ కలర్లు తీసుకుంటే ఉత్తమం. సింహరాశి వారు గర్వంగా ఉంటారు. ఎరుపు, పసుపు, కుంకుమ రంగులు ఎంతో మంచివి. వీరు కారు కొనుగోలు చేయాలనకుంటే ఈ కలర్లలో తీసుకుంటే వారికి ఎంతో మేలు కలుగుతుంది. కన్య రాశివారు ఆలోచనాత్మకంగా ప్రవర్తిస్తారు. ప్రశాంత స్వభావంతో మెలుగుతారు. వీరికి ఎరుపు, ఆకుపచ్చ, బూడిద రంగులు నచ్చుతాయి.

    తులరాశి వారు భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరికి తెలుపు, బూడిద, నలుపు రంగులు బాగుంటాయి. వీరు ఆ కలర్లు తీసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తారు. వీరికి ఎరుపు, పసుపు, కుంకుమ, గోధుమ రంగులు బాగుంటాయి. ధనస్సు రాశి వారు ఎరుపు, తెలుపు రంగులు నచ్చుతాయి. వాహనాలు కొనేటప్పుడు ఈ కలర్లు తీసుకోవడం ఎంతో మంచిది. మకర రాశి వారికి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగులు బాగుంటాయి. వీరు కూడా ఇవే కలర్లలో వాహనాలు కొనుక్కోవడం సురక్షితం.

    కుంభరాశి వారు తొందరపడకుండా నిదానంగా ఉంటారు. వీరికి నీలం, ఆకుపచ్చ, తెలుపు, నలుపు రంగులు బాగుంటాయి. వీరు వాహనాలను కొనుగోలు చేస్తే ఈ కలర్లలో తీసుకుంటే ఇబ్బంది ఉండదు. మీన రాశి వారికి ఎరుపు, కుంకుమ, పసుపు రంగులు నచ్చుతాయి. కారు కొనాలనుకుంటే ఈ కలర్లలో కొనుక్కోవడం వల్ల లాభం కలుగుతుంది. ఇలా పన్నెండు రాశుల వారు తమ జాతక ప్రకారం బాగుండే కలర్లు కావడంతో వాటినే తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని చెబుతారు.

    Tags