Dinner: నేటి బీజి బీజి లైఫ్ లో డబ్బుకు ఇచ్చే విలువ తినే ఆహారం, ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. వయస్సుతో తేడా లేకుండా వచ్చే చాలా ఆర్యోగ సమస్యలకు కారణం భోజనం టైమ్ కి చేయకపోవడమే అంటున్నారు నిపుణులు. విలువైన సమయాన్ని పార్టీలు, పబ్బులు, పంక్షలు అంటూ వృధా చేస్తూ ఉంటారు. కాని ఫ్రీ టైమ్ లో హెల్తీ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని సమయానికి మాత్రం తినడం లేదు. ఇంతకీ రాత్రి భోజనం అయినా సమయానికి చేస్తున్నారా? మరి ఆలస్యంగా డిన్నర్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఉదయం, పగలు కాస్త సమయం ఆలస్యంగా తిన్నా పర్వాలేదు కానీ నైట్ భోజనం విషయంలో సమయం పాటించాలి అంటున్నారు నిపుణులు. కనీసం 8గంటలకైనా డిన్నర్ పూర్తి చేయాలట. అయితే రీసెంట్ గా చేసిన పరిశోధనల్లో రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల కాన్సర్ లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఇక ర్రాతి భోజనం 9గం.ల తరువాత చేస్తే ఆర్యోగం చెడిపోతుందని Ncbi పరిశోధన సంస్థ తెలిపింది.
లేట్ నైట్ డిన్నర్ వల్ల ఆయాసం, గ్యాస్, ఊబకాయం, మలబద్ధకం, రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, గుండె సంబంధ వ్యాధులు, అజీర్ణం, వంటి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. రాత్రి భోజనం తర్వాత నిద్ర పోవడానికి మధ్యలో 2 గంటల వ్యవధి ఉండాలి కనీసం గంట వ్యవధి అయినా కచ్చితంగా ఉండాలి. కానీ కొందరు తిని వెంటనే పడుకుంటారు. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం కూడా అవదు.
ఇక మెదడు మెలుకువతో ఉన్నప్పుడు చేసే పనితీరు కంటే నిద్ర లో చాలా నిదానంగా పనిచేస్తుంది . కాబట్టి భోజనం చేసిన వెంటనే బెడ్ మీదికి వెళ్ళకూడదు. ఈ మధ్యకాలం లో తరుచుగా వినిపించే మాట నైట్ నిద్ర రావడం లేదు. దీనికి కారణం కూడా భోజనం లెట్ గా తీసుకోవడమేనట. తిని వెంటనే నిద్ర పోవడం వల్ల జీర్ణ వ్వవస్థ లోపం వలన నిద్రరాదట. మరి ఇప్పుడైనా కాస్త సమయానికి తిని పడుకోండి.