Road Safety : రోడ్డుపై ఉన్న ఈ నెంబర్ తో ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లు తెలియలేదే..!

Road Safety కారులో వెళ్తున్నప్పుడు అనుకోని ప్రమాదం జరుగుతుంది. దీంతో గాయాలవుతాయి. ఈ సమయంలో పై నెంబర్ కు కాల్ చేయడం వల్ల NHAI సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ ను పంపిస్తారు. దగ్గరుండి మరీ ఆసుపత్రికి పంపిస్తారు. ఇక కారు బ్రేక్ డౌన్ అయిన సమయంలోనూ ఈ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా వారు టోయింగ్ ను తీసుకు వస్తారు. మీ కారును సంబంధిత గ్యారేజీలోకి తీసుకెళ్తారు. ఇలా ఈ నెంబర్ కు కాల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

Written By: NARESH, Updated On : July 8, 2024 11:48 am

Road Safety

Follow us on

Road Safety : ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. కానీ ఎంత అప్రమత్తంగా ఉన్నా ఒక్కోసారి అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కారులో ప్రయాణించేటప్పుడు కారు టైర్ ఫంక్ఛర్ అవ్వడం గానీ, పెట్రోల్ అయిపోవడం గానీ జరుగుతాయి. ఇవే కాకుండా దురదృష్టవవాత్తూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాల్లో ఇవి జరిగినప్పుడు అందుబాటులో ఎవరూ ఉండరు. అందుకే రోడ్ సేప్టీ వాళ్లు రోడ్డు పక్కన కొన్ని నెంబర్ల కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిలో 1033 అనే నెంబర్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ నెంబర్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.

ప్రధాన రహదారుల వెంబడి ఎక్కువగా 1033 అనే నెంబర్ తో కూడా బోర్డులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ప్రయాణికులు అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు డయల్ చేయమని కోరుతాయి. ఈ నెంబర్ ద్వారా కావాల్సిన సేవలను పొందవచ్చు. ముఖ్యంగా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఫంక్ఛర్ అయింది. కానీ దగ్గర్లో ఎక్కడా సంబంధిత షాప్ ఉండదు. దీంతో ఈ నెంబర్ కు ఫోన్ చేయడం వల్ల National Haighway Authority Of India(NHAI) సిబ్బంది అక్కడికి వచ్చి టైర్ మారుస్తారు. వీరికి ఎలాంటి సర్వీస్ ఛార్జి చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒక్కోసారి తొందర్లో కార్లో పెట్రోల్ చూసుకోకుండానే ప్రయాణం చేస్తాం. దీంతో మధ్యలోనే కారు ఆగిపోతుంది. ఈ నేపథ్యంలో దగ్గర్లో ఉన్న 1033 నెంబర్ కు ఫోన్ చేయడం వల్ల రోడ్ NHAI సిబ్బంది 5 లీటర్ల పెట్రోల్ ను తీసుకువస్తాయి. దీనికి కూడా వారికి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తరువాత బంక్ వరకు వెళ్లి మిగతా పెట్రోల్ కొట్టించుకోవాల్సి ఉంటుంది.

కారులో వెళ్తున్నప్పుడు అనుకోని ప్రమాదం జరుగుతుంది. దీంతో గాయాలవుతాయి. ఈ సమయంలో పై నెంబర్ కు కాల్ చేయడం వల్ల NHAI సిబ్బంది దగ్గర్లోని ఆసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ ను పంపిస్తారు. దగ్గరుండి మరీ ఆసుపత్రికి పంపిస్తారు. ఇక కారు బ్రేక్ డౌన్ అయిన సమయంలోనూ ఈ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా వారు టోయింగ్ ను తీసుకు వస్తారు. మీ కారును సంబంధిత గ్యారేజీలోకి తీసుకెళ్తారు. ఇలా ఈ నెంబర్ కు కాల్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.