White Hair Treatment: ఇటీవల కాలంలో చిన్న వయసులోనే జుట్టు కలర్ మారుతోంది. తెల్లగా అవుతోంది. తెల్ల వెంట్రుకలతో నలుగురిలో తిరిగేందుకు సిగ్గుపడుతున్నారు. హెయిర్ స్టైల్ కోసం ఇబ్బందులు పడుతున్నారు. తెల్ల జుట్టుతో ఎలా అని మథనపడుతున్నారు. ఇరవైలోనే అరవైలా మారడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కావడానికి ప్రధాన కారణం మన ఆహారమే. మన పూర్వీకులకు వందేళ్లు వచ్చినా వెంట్రుకలు తెల్లబడేవి కాదు. మారుతున్న కాలంలో మందుల ఆహారం వల్ల జన్యుపరమైన కారణాలతో వెంట్రుకలు చిన్న వయసులోనే తెల్లగా మారడం కలవరపరుస్తోంది. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు.

తెల్లజుట్టును నల్లగా మార్చుకునేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. తెల్ల జుట్టు సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. ఇందుకు మనం చేయాల్సింది ఏంటంటే ఒక పెద్ద సైజు బంగాళాదుంప తీసుకుని దానికి ఉండే తొక్కను వేరు చేయాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీరు పోయాలి. నీళ్లు వేడి అవగానే అందులో సపరేట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప తొక్కలు తీసుకోవాలి. రెండు డబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకుని పది నిమిషాలు మరిగించాలి.
తర్వాత స్టైనర్ సాయంతో నీళ్లను ఫిల్టర్ చేసుకోవాలి. అందులో ఓ టేబుల్ స్పూన్ అల్మండ్ ఆయిల్ కోడిగుడ్డు పచ్చసొన వేసి కలుపుకోవాలి. తరువాత దాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. రెండు గంటల తరువాత షాంపుతో స్నానం చేస్తే చాలు. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఫలితం వస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారేందుకు దోహదపడుతుంది. ఇలా సింపుల్ రెమెడీ కావడంతో అందరు దీన్ని విధిగా పాటించి తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

చిన్న వయసులోనే జుట్టు నెవరడంపై ఆందోళన కలుగుతోంది. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే మన ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. జుట్టు రాలడం కూడా ఇటీవల ఎక్కువవుతోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, రాలడంతో ఏం చేయాలో కూడా తోచడం లేదు. యువత ఎక్కువగా ఈ సమస్యతోనే సతమతమవుతున్నారు. ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటే కూడా ఫలితం కనబడుతుంది. భవిష్యత్ లో కూడా మనకు కష్టాలు రాకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించక తప్పదు.