Puri Jagannath Temple: పూరి జగన్నాథ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. చారుధామ్ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. దేశంలో హిందూ దేవాలయాల్లో ఇది ఒకటి. ఏటా జగన్నాథుడి రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వనుల నడుమ వేడుకగా నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఇంద్రద్యుమ్మ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు స్థల పురాణం చెబుతోంది. పాండవులు యమరాజు దగ్గరకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు పూరి జగన్నాథుడి ఆలయాన్ని సందర్శించినట్టు చరిత్ర చెబుతోంది. సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలు జగన్నాథుడి ఆలయంలో ఉన్నాయన్న ప్రచారమైతే ఎప్పటి నుంచో ఉంది. ఇక్కడి ఆలయంపై హిందూ మతానికి సంబంధించి చిహ్నాలు, జెండాలు కనిపిస్తాయి. ఈ జెండాలు గాలి వీచిన వైపు కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటాయి. దీని వెనుక ఉండే రహస్యాలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు. 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు ఉండే సుదర్శన చక్రం ఆలయ పైభాగాన ఏర్పాటుచేశారు. పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసిన ఈ సుదర్శన చక్రం కనిపించడం దీని ప్రత్యేకత. ఏ వైపు నుంచి చూసినా ఈ చక్రం అభిముఖంగానే కనిపించడం దీని మరో ప్రత్యేకత.

ఇక్కడ విమానాలు ఎగురవు..
సాధారణంగా ఆలయాలు, ఇతర నిర్మాణాలపై పక్షులు, విమానాలు, విహంగాలు స్వేచ్ఛగా విహరించవచ్చు. కానీ ఈ ఆలయం పై నుంచి పక్షులు కానీ, విమానాలు కానీ విహరించవు. అలాగని ఇవి ప్రభుత్వ ఆంక్షలు కావు. ప్రభుత్వం నోఫ్లయింగ్ జోన్ అని కూడా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఆలయ పరిధి నో ఫ్లయింగ్ జోన్ గా ఏర్పడింది. ఇది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టడం లేదు. ఎవరూ వివరణ ఇచ్చుకోలేని రహస్య విషయంగా మిగిలిపోయింది. ఈ ఆలయానికి మరో అద్భుత చరిత్ర ఉంది. ఆలయ నీడ అసలు కనిపించిన సందర్భాలు లేవు. ఎండ తీవ్రంగా ఉన్నా రోజులో ఏదో సమయంలో కూడా నీడ కనిపించదంటే అద్భుత కట్టడం వెనుక ఏదో రహస్యం ఉంది. ఇది కట్టడం అద్భుతమా.. లేకుంటే దైవశక్తి మహత్యమా అన్నది ఇప్పటికీ వెల్లడి కావడం లేదు.
Also Read: Power Star Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది ఎవరో తెలుసా?
ఆలయ ప్రవేశంలో శబ్ధ తరంగాలు..
ఆలయానికి నాలుగు ద్వారాలుంటాయి. సింఘ ద్వారం ఆలయానికి ప్రధాన మార్గం. దీని గుండానే భక్తులు ఆలయం లోపలికి ప్రవేశిస్తుంటారు. ఆ సమయంలో మాత్రం శబ్ధ తరంగాలు, ధ్వనులు వినిపిస్తుంటాయి. ద్వారం నుంచి కాస్తా బయటకు వస్తే మాత్రం ఇవేవీ వినిపించవు. ఈ పరిణామాలను భక్తులు ఒక అద్భుతంలా భావిస్తుంటారు. సాధారణంగా ఉదయం పూట సముద్రం నుంచి భూభాగానికి.. సాయంత్రం భూభాగం నుంచి సముద్రం వైపు గాలులు వీస్తుంటాయి. పూరీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. ఇప్పటికీ ఇది సైన్స్ కు అంతుపట్టని అంశంగా మిగిలింది. 45 అంతస్తుల ఉండే ఆలయంపైకి వెళ్లి పూజారి జెండాను మారుస్తుంటారు.గత 18 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా జరిగే నిత్య ప్రక్రియ ఇది. ఇక్కడి ప్రసాదానికి కూడా ఎంతో చరిత్ర ఉంది. ప్రతీరోజూ 2 నుంచి 20 వేల వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల కోసం ప్రతీరోజూ ఒకే పరిమాణంలో ప్రసాదం తయారుచేస్తారు. కానీ ఏ రోజు ప్రసాదం మిగిలిపోయిందనో.. లేకుంటే చాలలేదన్న మాట ఈ ఆలయంలో వినిపించకపోవడం మరో అద్భుతం.

భారీ సొరంగ మార్గం..
పూరి ఆలయానికి మరో చరిత్ర ఉంది. ఇప్పటికీ ఆలయ రత్నభాండాగారం గురించి దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.రత్న భాండాగారం మూడో గది నుంచి సొరంగ మార్గం ఒకటుందన్న ప్రచారం అయితే ఉంది. అందులో భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు,రత్నాలు, బంగారు కిరీటాలు ..ఇలా విలువైన సంపద నిక్షిప్తమై ఉన్నాయన్న టాక్ అయితే నడుస్తోంది. ఇంత సంపద ఉన్న మూడో గదిని ఎందుకు తెరవడం లేదన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. 1926లో బ్రిటీష్ పాలకులు గదని తెరిచి అందులో ఉన్న సంపదను లెక్కించారు. మొత్తం 597 రకాల బంగారు ఆభరణాలు ఉన్నట్టు నిగ్గు తేల్చారు. వాటి విరాలను సమగ్రంగా అక్కడున్న శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో పేర్కొన్నారు. ఈ వివరాలను ఇటీవల ఓ చరిత్రకారుడు బయటపెట్టాడు. మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆ గది నుంచి కింది భాగానికి సొరంగ మార్గం ఒకటుందని చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల కిందట చరిత్రకారులు, నిపుణులు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పాములు బుసలు కొట్టే శబ్ధాలు వినిపించాయని చెప్పాడు. 12 నుంచి 18 శాతాబ్దం వరకూ ఉత్కళను పాలించిన రాజులు ఈ సంపదను రహస్య గదుల్లో దాచినట్టు చరిత్రకారుడు మీడియాకు వెల్లడించాయి. అయితే చారుధామ్ క్షేత్రాల్లో ఒకటైన జగన్నాథుడి ఆలయంలో సైన్స్ కు అంతుపట్టని ఎన్నో రహస్యాలు మాత్రం దాగి ఉన్నాయి.
Also Read:Ali-Posani: ఆలీ, పోసానికి నామినేటెడ్ పదవులు ఫిక్స్.. జగన్ సంచలన నిర్ణయం?