Bad Breath: మనలో కొందరి నోరు దుర్వాసన వస్తుంది. దీంతో వారు నోరు తెరిస్తే చాలు కంపు కొడుతుంది. వారు నలుగురిలో మాట్లాడటానికి సంకోచిస్తారు. ఎందుకంటే నోరు వాసన భరించలేనంతగా ఉంటుంది. నోరు తెరిస్తే పదిమందికి వాంతులు అవడం ఖాయం. మనం తినే ఆహార పదార్థాలే మన నోరు వాసన రావడానికి కారణాలవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. మన అలవాట్లే మనకు ఇబ్బందులు తెస్తాయి. నోటి దుర్వాసన వస్తుంటే మనం మాట్లాడలేం. కనీసం నవ్వటానికి కూడా వెనకడుగు వేస్తాం. నోరు దుర్వాసన ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటి? నివారణ ఎలా సాధ్యం అనే విషయాలను పరిశీలిస్తే మనకు కొన్నింటిపై అవగాహన రావడం జరుగుతుంది.

నోరు దుర్వాసన రావడానికి నోరే కారణం. ముక్కు చుట్టు పక్కల ఉండే గాలి గదులు, గొంతు, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయం వల్ల కూడా నోరు దుర్వాసన వస్తుంది. ఇంకా కాలేయ వైఫల్యం, కీటో అసిడోసిస్ వంటివి కూడా కారణంగా ఉంటాయి. మన నోట్లో 37 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. శ్వాస వదులుతున్నప్పుడు తేమ 96 శాతం ఉంటుంది. బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి కారణమవుతుంది. వీటిల్లో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల మన నోరు వాసన వస్తుంది. శుభ్రంగా కడుక్కోకపోతే అది మరింత పెరిగి నలుగురిలో తిరగకుండా చేస్తుంది.
చిగుళ్ల వాపు వల్ల కూడా దుర్వాసన వస్తుంది. పిప్పి పళ్ల వల్ల కూడా మన నోరు దుర్వాసన రావడం ఖాయం. మనం తినే ఆహార పదార్థాల్లో రసాయనాలుంటాయి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటివి తిన్నప్పుడు వీటిలో ుండే సల్ఫర్ రసాయనాలు రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతాయి. శ్వాస ద్వారా బయటకు వస్తాయి. అలాంటి సమయంలో నోరు దుర్వాసన వస్తుంది. గ్యాస్, అల్సర్లు వంటివి కూడా దుర్వాసనకు కారణాలుగా నిలుస్తాయి. వేళకు తినకపోడం, కొన్ని రకాల ఆహార పదార్థాలు నోటి దుర్వాసన పెంచుతాయి.

నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే నోరును శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా బ్రష్ చేసుకోవాలి. చిగుళ్లలో వాపు రాకుండా చూసుకోవాలి. కట్టుడు పళ్లు, బ్రిడ్జిలు, మౌత్ గార్డులు అమర్చుకునే వారు రోజు వాటిని జాగ్రత్తగా శుభ్రం చేసుకుంటే సరి. పొగ తాగే వారిలో కూడా నోటి దుర్వాసన వస్తుంది. పలుచటి బద్ధతో నాలుక మీద గీసుకోవాలి. మద్యం, పొగాకులకు దూరంగా ఉండాలి. ఉల్లిగడ్డలు, వెల్లుల్లికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. మధుమేహులు గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.