Venkatesh – Soundarya: సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలను చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపిస్తాయి..అలాంటి జంటలలో ఒకటి విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య జంట..వీళ్లిద్దరి కాంబినేషన్ ఒక చరిత్ర అనే చెప్పొచ్చు..ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా, పవిత్ర బంధం , జయం మనదేరా, దేవిపుత్రుడు , పెళ్లి చేసుకుందాం మరియు సూపర్ పోలీస్ వంటి చిత్రాలు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చాయి..వీటిలో దేవిపుత్రుడు మరియు సూపర్ పోలీస్ అనే సినిమాలు మినహా మిగిలిన చిత్రాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ హిట్స్.

వీళ్ళు కలిసి అన్ని సినిమాలలో నటించారు కాబట్టి అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే రూమర్స్ గట్టిగా వినిపించాయి..ఆరోజుల్లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అలాగే ఉండేది..వెండితెర మీద వీళ్ళిద్దరిని చూస్తునంతసేపు భార్య భర్తలు అంటే వీళ్లిద్దరి లాగానే ఉండాలి అనిపించేది..అయితే ఈ రూమర్స్ పై వెంకటేష్ కెమెరామ్యాన్ రాఘవ గారు ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘వెంకటేష్ చూసే దానికి చాలా ఫన్నీ గా కనిపిస్తారు కానీ..ఆయన మనసు చాలా సున్నితమైనది..మంచి ఎమోషనల్ పర్సన్..తన తండ్రి రామానాయుడు అంటే వెంకటేష్ కి దైవం తో సమానం..ఆయన చనిపోయినప్పుడు ఆ బాధ నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది..వెంకటేష్ పరిస్థితిని నేను అర్థం చేసుకొని ఒక వారం రోజులు ఆయన ఇంటికి వెళ్లడం మానేసాను..అప్పుడు ఆయనే నాకు ఫోన్ చేసి ఇంటికి పిలిచారు..కమిట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఎంత బాధలో ఉన్నా కానీ షూటింగ్స్ లో పాల్గొనాల్సిందే..వెంకటేష్ గారికి ఆ సమయం లో నేను మేకప్ వేస్తున్నప్పుడు ఆయన కళ్ళలో నుండి నీళ్లు వచ్చేవి..అలా బాధ ని దిగమింగుకొని ఆయన షూటింగ్ చేసేవారు’ అని చెప్పాడు.

ఇంకా ఆరోజుల్లో సౌందర్య తో వెంకటేష్ కి లింక్ ఉందంటూ వచ్చిన రూమర్స్ పై కూడా స్పందిస్తూ ‘వెంకటేష్ – సౌందర్య కాంబినేషన్ లో 7 సినిమాలు వచ్చాయి..అందుకే అలాంటి రూమర్స్ వచ్చాయి కానీ వాళ్ళ మధ్య అలాంటివేమీ లేదు..వెంకటేష్ ఆమెని సోదరి భావం తోనే చూసేవాడు..ఆమె కూడా వెంకటేష్ ని సార్ అనే పిలుస్తూ ఉండేది..ఆమె చనిపోయినప్పుడు కూడా వెంకటేష్ చాలా బాధ పడ్డాడు’ అంటూ రాఘవ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.