
Good Couple : ఆలుమగల బంధంలో అనురాగం పెంచేది రతి కార్యమే. భార్యాభర్తలు వారంలో కనీసం మూడు నాలుగు సార్లు అయినా పాల్గొంటే వారి మనసు తేలికగా ఉంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఫలితంగా సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇద్దరి మధ్య అరమరికలు లేకుండా పోతాయి. దంపతుల మధ్య ఆ బంధమే వారికి కలిసొస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెంచుకునే పనులతో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. దీనికి వారు ఏం చేస్తే ప్రయోజనం కలుగుతుందో చూద్దాం.
సఖ్యత
దంపతుల మధ్య సఖ్యత ముఖ్యం. ఇద్దరు ఏకాబిప్రాయం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఫలితంగా భార్యాభర్తలు అన్నింట్లో మంచి దూకుడు ప్రదర్శించవచ్చు. ఇలా ఆలుమగలు అన్నింట్లో మంచి నిర్ణయాలు తీసుకుంటే వారికి ఎదురుండదు. అందుకే అప్పుడప్పుడు రతి క్రీడలో ఓలలాడితేనే వారి మానసిక స్థితి బాగుంటుంది.
కలిసి వ్యాయామం చేయడం
భార్యాభర్తలు కలిసి వ్యాయామం చేయడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇద్దరి మధ్య అనురాగం తాండవిస్తుంది. దీంతో వారి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. కలిసి చేసే పనులతో సఖ్యత బాగా ఉంటుంది. దీని వల్ల భవిష్యత్ లో కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల వారి మనసులు ప్రశాంతంగా మారతాయి.

ఒత్తిడి
జీవితంలో మనం చేసే పనులతో కాస్త ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. దీన్ని దూరం చేసుకోవాలంటే ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అన్నింటిని భూతద్దంలో చూసుకోకూడదు. జీవిత భాగస్వామితో మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంటే చక్కటి ఫలితాలు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది.
పడక గది
పడక గది విషయంలో కూడా ఇద్దరు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలి. కొందరికి వెలుతురు ఉంటే ఇష్టం. మరికొందరికి చీకటి అంటేనే ఇష్టం. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి సంబంధం పెరగాలంటే ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.