
Health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్లలు. మనశరీర ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో మారుతున్న జీవనశైలి ఎందరినో రోగాల బారిన పడేస్తోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి రోగాల బారిన పడుతున్నారు. దీంతో మందులు వాడాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలంటే ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే ఇబ్బందులు తలెత్తడం ఖాయం.
పచ్చి ఉల్లిపాయ, మజ్జిగతో మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవి కాలంలో మజ్జిగ తీసుకోవడం ద్వారా ఎన్నో రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిక ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల శరీరం చల్లదనంగా మారుతుంది. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే కూడా మజ్జిగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మజ్జిగ తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పెరుగు కంటే మజ్జిక తాగడం ఎంతో లాభం.

ధనియాల కషాయం రెండు పూటలా కలిపి తాగితే మూత్ర సమస్యలు ఉండవు. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించినది, ఒక టీస్పూన్ వాము కలిపి రాత్రి సమయంలో ఒక గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయం ఒక పాత్రలో పోసుకుని సగం అయ్యే వరకు వేడి చేసుకుని తరువాత వడకట్టుకుని తాగితే దాదాపు 40 రకాల రోగాలకు ఉపశమనం లభిస్తుంది. మన ఆరోగ్యం కోసం ఎన్నో చిట్కాలున్నాయి. వీటితో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆహారం తీసుకునే ముందు ఒక కప్పు వేడి నీళ్లు తాగితే రక్తం శుద్ధి అవుతుంది. అసలు మనం రోజంతా కూడా కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల రోగాలు రాకుండా ఉంటాయి. నీటిని వేడి చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తాయి. దీని వల్ల మనకు రోగాలు రాకుండా నియంత్రిస్తాయి. అందుకే వేడి నీళ్లు తాగడం ఉత్తమం. మనం కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే అనారోగ్యాలు మన దరికి రావు. ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించే ఆస్కారం ఏర్పడుతుంది. అందుకే మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది.