
Oscar: రామ్ చరణ్ దంపతులను హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కలిశారు. ఈ మేరకు చరణ్ దంపతులతో కలిసి ఫోటోలకు ఫోజిచ్చారు. ఆస్కార్ వేడుకల్లో ప్రియాంక చోప్రాతో పాటు రామ్ చరణ్, ఉపాసన పాల్గొన్నారు. దీంతో రామ్ చరణ్ ప్రియాంక కలిసి ఫోటో షూట్ చేశారు. గతంలో రామ్ చరణ్-ప్రియాంక జంటగా నటించిన విషయం తెలిసిందే. జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్ నటించగా… ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేశారు. ఆ అనుబంధంతో వీరిద్దరి మధ్య పలకరింపులు చోటు చేసుకున్నాయి. రామ్ చరణ్ ని కలవడంతో ప్రియాంక ఉబ్బితబ్బిబ్బయ్యారని సమాచారం. అలాగే ఆస్కార్స్ పాల్గొన్న సౌత్ ఏషియా నటులుగా వీరికి ప్రత్యేక గౌరవం దక్కింది.
ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఆమె నటించిన హాలీవుడ్ సిరీస్లు, సినిమాలు ప్రాచుర్యం పొందాయి. ఆమెకు అక్కడ ఫేమ్ దక్కింది. 2018లో ప్రియాంక అమెరికన్ నటుడు, సింగర్ అయిన నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి. సరోగసి పద్దతిలో ప్రియాంక చోప్రా తల్లి అయ్యారు. హాలీవుడ్ లో సినిమా ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో లాస్ ఏంజెల్స్ లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. నిక్ జోనాస్ తో లాస్ ఏంజెల్స్ లో కాపురం పెట్టింది.
ఆర్ ఆర్ ఆర్ మూవీ నామినేషన్స్ లో ఉన్న తరుణంలో రామ్ చరణ్ కి ఆస్కార్స్ లో పాల్గొనే ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలో ప్రియాంక చోప్రాతో ఆయన కలిశారు.వీరితో ఉపాసన సైతం జాయిన్ అయ్యారు. ఇక రామ్ చరణ్ త్వరలో హాలీవుడ్ చిత్ర ప్రకటన చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయన ఫేమ్ విశ్వవ్యాప్తం కాగా… హాలీవుడ్ మేకర్స్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. ఆ రోజు చరణ్ హాలీవుడ్ ప్రాజెక్ట్ పై ప్రకటన వస్తుందన్న ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇది పొలిటికల్ రివేంజ్ డ్రామా అన్న ప్రచారం జరుగుతుంది. శంకర్ మూవీ అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో మూవీ చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
View this post on Instagram