
Kamal Hasan Daughter: మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు చాలా తక్కువ.మన దర్శక నిర్మాతలు ఎక్కువగా గోవా, ముంబై నుండి వచ్చిన బ్యూటీస్ మాత్రమే కావాలి.ఎవరో ఒకరిద్దరు మినహా, ఇప్పటి వరకు తెలుగు అమ్మాయికి స్టార్ స్టేటస్ దక్కడం అనేది చాలా అరుదు.కొంతమంది అమ్మాయిలు ఇక్కడ అవకాశాలు రాకపొయ్యేసరికి తమిళం మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లకు వలస వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సంపాదించుకున్నారు.అలాంటి హీరోయిన్స్ లో ఒకరు గౌతమీ.ఈమె ఇది వరకు కేవలం ఒక తమిళ సినిమా ఇండస్ట్రీ కి సంబందించిన హీరోయిన్ గానే ఇన్ని రోజులు మనం చూసాము, కానీ వాస్తవానికి ఈమె తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి.విశాఖ కి చెందిన ఈ అమ్మాయి తన విద్యాబ్యాసం ని గీతం యూనివర్సిటీ లో పూర్తి చేసింది.ఆమె చదువుకునే రోజుల్లోనే ‘దయామయుడు’ అనే సినిమా ద్వారా ఒక చిన్న పాత్రతో పరిచయం అయ్యింది.
ఆ తర్వాత నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరో గా నటించిన ‘గాంధీనగర్ రెండవ వీధి’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం తో తెలుగు లో ఈమెకి అవకాశాలు రాలేదు,కానీ తమిళం మరియు కన్నడ ఇండస్ట్రీలలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.అక్కడ సక్సెస్ అయినా తర్వాత మళ్ళీ ఈమెకి తెలుగు లో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది కానీ,ఆమె ఎక్కువగా ప్రాధాన్యత చూపించింది మాత్రం తమిళ సినిమా పైనే.వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది ఈమె.అలా కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయం లోనే సందీప్ భాటియా అనే వ్యాపార వేత్తని పెళ్లాడింది.1998 వ సంవత్సరం లో వీళ్లిద్దరికీ పెళ్లి అవ్వగా, 1999 వ సంవత్సరం లో కొన్ని విబేధాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది.
ఆ తర్వాత ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో కొంతకాలం డేటింగ్ చేసింది.2004 వ సంవత్సరం లో వీళ్ళ మధ్య అనుకూల పరిస్థితులు చోటు చేసుకోకపోవడం తో విడిపోవాల్సి వచ్చింది.కానీ ఇప్పటికీ వీళ్లిద్దరు మంచి స్నేహితులే.వీళ్లిద్దరు కలిసి దృశ్యం రీమేక్ లో కూడా కొన్నేళ్ల క్రితమే నటించారు.ఇది ఇలా ఉండగా గౌతమీ తన కూతురుకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది.ఆమె కూతురు పేరు సుబ్బలక్ష్మి, ఆమెకి సంబంధించిన ఫోటోలను చూసి కుర్రకారులు మెంటలెక్కిపోతున్నారు.ఇప్పుడున్న ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ కంటే కూడా అందంగా కనిపిస్తున్న ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.