Heart Attack Symptoms: గుండెపోటు రావడానికి ముందు మనకు ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసా

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతిలో నొప్పి, నీరసం రావడం వంటివి కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. మంచి ఆహారాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెడు ఆహారాలు తీసుకోవద్దు. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. యోగా ఆచరించాలి. కనీసం 45 నిమిషాలు నడక కొనసాగించాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

Written By: Srinivas, Updated On : June 28, 2023 4:34 pm

Heart Attack Symptoms

Follow us on

Heart Attack Symptoms: ఈ రోజుల్లో గుండె జబ్బులు మామూలుగా మారాయి. రెప్పపాటులోనే ప్రాణాలు కోల్పోయేలా చేస్తున్నాయ. దీంతో మనకు ముందే తెలుస్తుంది. గుండె పోటు రావడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మనం అప్పుడే అప్రమత్తం అయితే గుండెకు ఎలాంటి ఢోకా ఉండదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే పోతాయి. అందుకే మనం జాగ్రత్త వహించి ఆస్పత్రిలో చేరితే మంచిది. గుండెపోటు రావడానికి ముందు మనకు కనిపించే లక్షణాలేమిటో చూద్దాం.

నిద్రలో ఉన్నప్పుడు..

మనం పని చేసుకుంటూనే ఉన్నప్పుడు, జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు, నిద్రలో ఉన్నప్పుడు కూడా గుండెపోటు రావడానికి ఆస్కారం ఉంటుంది. చాతిలో నొప్పి రావడతో పాటు అజీర్తి వంటి సమస్యలు ఏర్పడతాయి. ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవడం లాంటివి గుండెపోటుకు కారణాలుగా ఉంటాయి. కొంతమందికి గ్యాస్ట్రిక్, అసిడిటి, కడుపులో నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు గుండెపోటు రావడానికి కారణాలుగా ఉంటాయి. ఇటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్వాస తీసుకోవడంలో..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతిలో నొప్పి, నీరసం రావడం వంటివి కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. మంచి ఆహారాలు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. చెడు ఆహారాలు తీసుకోవద్దు. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. యోగా ఆచరించాలి. కనీసం 45 నిమిషాలు నడక కొనసాగించాలి. ఇలాంటి పనులు చేయడం వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

రక్త సరఫరా

రక్త సరఫరా బాగుండాలి. రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వుతో గుండె జబ్బు ముప్పు రావచ్చు. రక్త సరఫరాకు అడ్డుగా కొవ్వు చేరితో గుండెకు రక్తం సరిగా సరఫరా కాదు. దీంతో ఆక్సిజన్ అందదు. కండరాలు చచ్చుబడిపోతాయి. గుండెపోటు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా గుండె జబ్బుల నుంచి ముందే మేల్కొంటే భవిష్యత్ లో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉండదని తెలుసుకోవాలి.