Vastu Tips: మనం వాస్తును పక్కాగా నమ్ముతాం. ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాస్తు నియమాలు అనుసరిస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకే మన ఇంటిలో వాస్తు ప్రకారం అన్ని పద్ధతులు పాటిస్తుంటాం. ఈనేపథ్యంలో మనం బాత్ రూం ఎలా ఉంచుకోవాలో కూడా చెబుతుంది వాస్తు. స్నానం చేసిన తరువా ఖాళీ బకెట్ ను బాత్ రూంలో ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి.
ఖాళీ బకెట్ ఉండొద్దు
చాలా మంది స్నానం చేసిన తరువాత ఖాళీ బకెట్ ను స్నానాల గదిలోనే ఉంచుతారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులొస్తాయి. స్నానం చేసినప్పుడు ఖాళీ బకెట్ ఉంచకుండా దాన్ని బయటకు తీసుకురావాలి. వాస్తు ప్రకారం నల్ల బకెట్ ఉంచుకోకూడదు. నలుపు రంగు సమస్యలకు మూలంగా నిలుస్తుంది. ఇలా మనం వాస్తు చిట్కాలుపాటిస్తే మంచి జరుగుతుంది.
ఆకుపచ్చ కలర్ బకెట్
బాత్ రూంలో ఆకుపచ్చ కలర్ బకెట్ ఉంచుకుంటే సురక్షితం. ఈ కలర్ బకెట్ ఉంచుకుంటే రాహువు దుష్ర్పభావాల నుంచి రక్షణ కలుగుతుంది. ఆకుపచ్చ కలర్ శుభప్రదంగా నిలుస్తుంది. బాత్ రూంను అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. అలా ఉంచితే డబ్బుకు కొరత వస్తుంది. టైల్స్ కూడా ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
వాస్తు చిట్కాలు
ఇలా వాస్తుకు సంబంధించిన చిట్కాలు పాటించకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. ఇంట్లో డబ్బుకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వాస్తు పద్ధతులు పక్కా పాటించాల్సిందే. లేదంటే మనకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. అందుకే వాస్తు ప్రకారం అడ్డంకులు లేకుండా చూసుకుంటే సరి. లేదంటే సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది.