
Sleep Tips: ఇటీవల చాలా మందికి సరైన తిండి, నిద్ర ఉండటం లేదు. దీంతో ఎన్నో రోగాల బారిన పడుతున్నాం. ఇంట్లో సుఖశాంతులు విరియాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా, మనిషికి కష్టాలు రాకుండా ఉండాలన్నా వాస్తు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. మనిషి బాధలు లేకుండా బాగుండాలంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి. హాయిగా నిద్రపోయేలా చూసుకోవాలి. ఇవి ఉంటేనే మనిషికి సుఖమైన నిద్ర సొంతం అవుతుంది. తద్వారా సమస్యలు లేని జీవితం అవుతుంది. జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటేనే రోగాలు రాకుండా ఉంటాయి.
చాలా మంది సరిగా నిద్ర పోకపోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. సరైన నిద్ర లేకపోతే కష్టాలు తప్పవు. వాస్తు పద్ధతుల ప్రకారం ఇల్లు కట్టుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు తలెత్తి మనకు నిద్ర కరువవుతుంది. దీంతో జబ్బుల బారిన పడి మనకు అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మంచిగా నిద్ర పోవాలంటే కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పడుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సుఖమైన నిద్ర మన సొంతం అవుతుంది. ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండకుంటే అంతేసంగతి.
మనం పడుకునే సమయంలో మన పవిత్ర గ్రంథం భగవద్గీత పక్కన పెట్టుకుంటే చెడు కలలు వంటివి పడకుండా ఉంటాయి. శాంతి, ప్రశాంతమైన నిద్ర లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పలు రకాల వ్యాధుల బారిన పడటం ఖాయం. పువ్వుల సువాసన కూడా మనకు మత్తెక్కించి మంచి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి సుఖమైన నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. నిద్రలో పీడకలలు రాకుండా ఉండాలంటే మంచం దగ్గర ఇనుప వస్తువులను ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

మంచి నిద్ర కోసం కొన్ని యాలకులు తీసుకుని ఒక గుడ్డలో మూటకట్టి దాన్ని మంచం కింద పెట్టుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి ప్రశాంతమైన నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. పడుకునేటప్పుడు దక్షిణం దిశకు తల పెట్టుకుని ఉత్తర దిశకు కాళ్లు పెట్టుకుంటే మంచి నిద్ర డుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. దీంతో ఐశ్వర్యం, ఆనందం, కీర్తి లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఉత్తరం వైపు తలపెట్టి నిద్రిస్తే నిద్ర భంగం కలుగుతుంది. ఉత్తరానికి అధిపతి కుబేరుడు కావడంతో తలనొప్పి వస్తుంది. ఇలా చేయడం వల్ల వ్యాధుల బారిన పడతాం.
తూర్పు దిక్కు తలపెట్టి నిద్ర పోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. తూర్పు వైపు అధిపతి ఇంద్రుడు కావడంతో మనకు దేవేంద్రుడి ఆశీస్సులు దక్కుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. పడమర వైపు తల పెట్టి నిద్రిస్తే కూడా అనుకూల ప్రభావాలు దక్కుతాయి. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. నిద్రించే సమయంలో వాస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే హాయిగా నిద్ర పట్టదు. ఆరోగ్యం బాగుండదు. సంతోషంగా జీవించే అవకాశం ఉండదు. దీంతో పలు సమస్యలు చుట్టుముడతాయి.