Gruhapravesam: మనం కొత్త ఇల్లును కట్టుకున్నాక గృహ ప్రవేశం చేసేటప్పుడు కొన్ని పరిహారాలు పాటించాలి. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ ప్రవేశం చేసేటప్పుడు మన సనాతన సంప్రదాయాలు, సంప్రదాయాలు పాటించాలి. లేకపోతే మనకు ఇబ్బందులు రావడం సహజం. అందుకే మన గృహ ప్రవేశానికి కొన్ని పద్ధతులు అనుసరిస్తే మనకు శుభం కలగడం జరుగుతుంది.
శుభ ముహూర్తం
కొత్త ఇంట్టోకి ప్రవేశించే ముందు శుభ ముహూర్తం చూసుకోవాలి. కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు సంఖ్యా శాస్త్రం, క్యాలెండర్ ప్రకారం గృహ ప్రవేశానికి ముహూర్తం నిర్ణయించుకోవాలి. శుభ తిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సంతోషాలు వెల్లివిరుస్తాయి. మంచి సమయంలో కొత్త ఇంట్లోకి వెళితే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కొత్త చీపురు
కొత్త ఇంట్లోకి పాత చీపురు తెచ్చుకోకూడదు. నూతన ఇంటికి కొత్త చీపురే కొనుక్కుని తెచ్చుకోవాలి. చీపురును లక్ష్మీదేవి ప్రతిరూపంగా చూస్తారు. వాడిన చీపురును కాకుండా కొత్త చీపురును వాడాలి. పాత చీపురును ఎట్టి పరిస్థితుల్లో పాతది ఇంట్లో పెట్టుకోకూడదు. కొత్త ఇంట్లోకి కొత్త చీపురును వాడుకోవడమే మంచిది. దానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
ధాన్యం
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకొస్తారు. దీని వల్ల ఇంట్లో తిండికి లోటుండొద్దంటూ అలా చేస్తారు. తృణ ధాన్యాల్లో స్వీట్లు ఉంచుకుంటారు. ఆహారం ప్రాథమికంగా అత్యవసరమైన పంట. ఇంట్లో తిండికి తిప్పలు ఉండకూడదనే ఉద్దేశంతో ధాన్యం కూడా ఇంట్లోకి తీసుకువస్తారు.
కొబ్బరి చెట్టు నాటడం
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కొబ్బరి మొక్క నాటడం ఆనవాయితీ. సముద్ర మథనంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కల్పవృక్షం అని చెబుతారు. కొబ్బరి చెట్టును తల్లిలా పూజిస్తారు. అందుకే కొత్త ఇంట్టోకి వెళ్లేటప్పుడు కొబ్బరి మొక్క నాటడం తప్పనిసరి. దీని వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కీర్తి పెరగడానికి ఇది కారకంగా నిలుస్తుంది.
పాలు పొంగించాలి
కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు పాలు పొంగించాలి. పొయ్యిపై పాలు వేడి చేసి అవి పొంగేలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అలా మరిగించిన పాలను ఇష్టదేవతకు నైవేద్యంగా పెట్టడం సహజం. పాలతో తీపి పదార్థాలు కూడా తయారు చేసుకుంటారు.
ఆవును తీసుకురావాలి
కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఆవును తీసుకురావాలి. ఇంట్లో ఏదైనా దుష్ట శక్తులు దాగి ఉన్నట్లయితే ఆవును తీసుకొస్తే వెళ్లిపోతుంది. పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించి ప్రధాన ద్వారం గుండా తీసుకెళ్లాలి. ఇంట్లో దేవతలు కొలువుంటారని నమ్మకంతో ఆవుకు తీపి పదార్థాలు తినిపిస్తారు. నైవేద్యంగా ఆహారం పెడతారు. హారతి ఇచ్చి పూజిస్తారు.
కలశంతో పూజ
గృహ ప్రవేశం సమయంలో దేవతలు కొలువుంటారని విశ్వసిస్తారు. ఇంటిని రక్షించేందుకు సానుకూల శక్తులు లభించడానికి కలశంతో పూజలు చేస్తారు. కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు ఇంటిని శుద్ధి చేసి ఇంట్లో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. కలశాన్ని ఉంచి గణపతిపూజ, వాస్తు దోష పూజ, నవగ్రహ పూజ శాంతి పూజలు చేయడం వల్ల శుభప్రదం.
దేవుడి పటం
ఇంట్లోకి ప్రవేశించే ముందు దేవుడి పటం వెంట ఉంచుకోవాలి. దేవుడి పటంతో ఇంట్లోకి వెళ్లే మంచి జరుగుతుంది. భగవంతుడి చిత్రపటం ఉంచుకోవడం వల్ల శుభాలు కలుగుతాయి. దేవుడి చిత్ర పటం ఎక్కడ ఉంచాలో తెలుసుకుని సరైన చోటు ఉంచితే శుభం.