Guruvaram: మన సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. సనాతన సంప్రదాయంలో కట్టుబాట్లతోనే మనం సహజీవనం చేస్తున్నాం. మనకు వారానికి ఏడు రోజులు. సంవత్సరానికి పన్నెండు నెలలు. ఏడు రోజుల్లో గురువారం చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుని ఆచరిస్తే మనకు నష్టాలు రాకుండా ఉంటాయి. గురువారం ఏ పనులు చేస్తే అరిష్టమో తెలుసుకుని వాటిని మానేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. హిందూ మతంలో గురువారం ప్రత్యేకంగా కొన్ని పనులు చేయరాదని సూచించబడింది. దీంతో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
మన ముందు తరం వారు మనకు బోధించిన ఎన్నో విషయాలు పాటిస్తున్నాం. ఇందులో శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గురువారం చేయకూడని పనుల విషయంలో కూడా మన పూర్వీకులు మనకు కొన్ని పరిమితులు విధించారు. అవేంటో చూద్దాం. గురువారం రోజు ఇల్లును శుభ్రం చేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను తొలగించడం ఆచరించకూడదు. ఇలా చేయడం వల్ల మనకు దురదృష్టం కలుగుతుందని చెబుతుంటారు. అందుకే గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లును శుభ్రం చేసే పని పెట్టుకోకూడదు.
మహిళలు గురువారం తలస్నానం చేయకూడదు. గురువారం బృహస్పతి దినంగా భావిస్తారు. అందువల్ల గురువారం తల కడుక్కోవడం వల్ల దురదృష్టం కలుగుతుంది. డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇంకా గురువారం జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. గడ్డం గీసుకోవద్దు. గోళ్లు కత్తిరించుకోవద్దు. ఇలా చేస్తే దురదృష్టాన్ని ఆహ్వానించినట్లే. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంటుంది. గురువారం ఈ పనులు చేయకుండా మానేయడమే బెటర్.
గురువారం పదునైన వస్తువులు కొనుగోలు చేయొద్దు. అద్దాలు, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులు కొంటే చెడు ఫలితాలు వస్తాయి. కానీ ఈ రోజు ఆస్తులు కొనడానికి మంచి కాలంగానే భావిస్తారు. ఇక ఒక లక్ష్మీదేవిని మాత్రమే పూజించకుండా విష్ణు సహిత లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకు మంచి జరుగుతుంది. వివాహితలు తమకు సంపదలు కలగాలంటే విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా కొలిస్తే మంచి లాభాలు కలుగుతాయి. దీంతో మనం లక్ష్మీదేవి మహావిష్ణువును కొలవడం ద్వారా శుభాలు దక్కించుకోవచ్చు.