Married Women Google Search: దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతమైపోయింది. చిన్న కుటుంబాల వెల్లువ కొనసాగుతోంది. దీంతో అనుబంధాలు, ఆప్యాయతలు కరవవుతున్నాయి. అత్తవారింట్లో మసలుకునే తత్వం ప్రస్తుతం పెళ్లి చేసుకునే జంటల్లో కొరవడుతోంది. ఫలితంగా వారు ఏం చేయాలనే దానిై స్పష్టమైన అవగాహన ఉండటం లేదు. అనురాగాలు కానరావడం లేదు. దీంతో కుటుంబ నిర్వహణ కష్టంగా మారుతోంది. భవిష్యత్ పై బెంగతో సంసారాలు చెల్లాచెదురైపోతున్నాయి. అయినా కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల్లో సమన్వయం కొరవడుతోంది. ఇటీవల కాలంలో అంతా నెట్ పుణ్యంతోనే నడుస్తోంది.

అన్ని విషయాలు సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తున్నారు. గూగుల్ లో వెతుకుతున్నారు. సంసారం చేయడం ఎలా? మొగుడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? భర్తతో ఎలా మసలుకోవాలి? తదితర విషయాలపై గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కొత్తగా పెళ్లయిన అమ్మాయి తన కాపురం మూడు కాలాల పాటు ముచ్చటగా సాగేందుకు కావాల్సిన విషయాలపై అన్వేషణ కొనసాగిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఎంత ప్రయత్నించినా గూగుల్ లో వెతికితే సంసారం గురించి నిజాలు తెలుస్తాయా? అది అమాయకత్వమే అనుకోవచ్చు.
Also Read: Cabinet Reshuffle in Telangana: మంత్రివర్గ మార్పునకు లైన్ క్లియర్.. రాజ్‌భవన్‌లో ఎంట్రీ అందుకేనా?
అదే ఉమ్మడి కుటుంబాల్లో కొత్తగా పెళ్లయిన కోడలు నడుచుకోవాల్సిన విషయాలు కుటుంబ సభ్యులు నేర్పేవారు. అత్తగారు, ఆడబిడ్డలు, అక్కలు, చెల్లెళ్లు, మరుదులు, బావలు అందరు ఉమ్మడి కుటుంబంలో ఉండటంతో వారు సూచించిన మార్గాలతో ఎన్నో విషయాలు నేర్చుకునే వారు. కానీ కాలక్రమంలో ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై చిన్న కుటుంబాల ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా ప్రేమానురాగాలు దూరంగా ఉంటున్నాయి. ఆప్యాయతలు అడ్డుగా నిలుస్తున్నాయి.

దీంతో గూగుల్ లో వెతికితే ఏముంటుంది? స్వయంగా అనుభవిస్తే కానీ ఆ మర్యాదలు, ఆప్యాయతలు అంత తేలిగ్గా అర్థం కావు. భర్తతో ఎలా ప్రవర్తించాలి? ఎలా మసలుకోవాలి? భర్తను ఎలా కొంగుకు కట్టేసుకోవాలి తదితర విషయాలపై గూగుల్ లో వెతుకున్నట్లు తెలుస్తోంది. ఆచరిస్తేనే అన్ని విషయాలు అర్థమవుతాయి. అంతే కానీ పుస్తకాలు చదివి కాపురం చేయడానికి కాపురమేదైనా సామాజిక మాధ్యమమా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అందుకే ప్రేమానురాగాలు కలగాలంటే సంబంధిత వ్యక్తులుంటేనే కానీ గూగుల్ లో మాత్రం దొరకదని తెలుసుకుంటే మంచిది.
Also Read:CM KCR Visits Raj Bhavan: కేసీఆర్ కాంప్రమైజ్.. రాజ్‌భన్‌కు వచ్చిన సీఎం.. తమిళిసైతో మాటామంతి!