
Healthy Breakfast Food: సాధారణంగా ప్రతి మనిషి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ చేస్తుంటాడు. కానీ ఉదయం పూట చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఏం తినాలనే దాని మీదే అందరు ఆలోచిస్తుంటారు. కొందరు ఇడ్లీ, దోశ, పూరీ, బజ్జీ వంటివి తింటారు. కానీ వీటి వల్ల పోషకాలు అందవు. ఏదో కడుపు నిండిందనే భావన మాత్రమే కలుగుతుంది. రోజంతా హుషారుగా ఉండేలా చూసుకోవాలంటే పోషకాలు ఉన్న ఆహారం ఎంచుకోవడం ఉత్తమం. ఇంకా కొందరైతే అల్పాహారం మానేసి డైరెక్టుగా మధ్యాహ్న భోజనమే చేస్తారు. ఇలా చేయొద్దు. దీంతో మన శారీరక వ్యవస్థ ఇబ్బందులు పడుతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ప్రొటీన్లు ఉండే ఆహారాలు తీసుకోవడం ఉత్తమం.
ఎందులో ప్రొటీన్లు ఉంటాయి?
బ్రేక్ ఫాస్ట్ లో మనం తీసుకునే ఆహారంల్లో వేటిలో ప్రొటీన్లు ఉంటాయో తెలుసా? తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు వంటి వాటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే రోజు ఉదయం ఓ కోడిగుడ్డు తీసుకోవాలని చెబుతుంటారు. అది ఉడకబెట్టింది అయినా తీసుకోవచ్చు. ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు. రోజుకో గుడ్డు తీసుకుంటే మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. పోషకాహార లోపం ఏర్పడకుండా ఉంటే వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. దీంతో శక్తి లభిస్తుంది.

ఇంకా ఏం తీసుకోవాలి?
ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో స్ట్రాబెర్రీలను తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పోషకాలు, ప్రొటీన్లు, కొవ్వులు అన్ని ఇందులో దొరుకుతాయి. వెన్న లేదా నెయ్యితో చేసిన వాటిని తీసుకోవడం మంచిది. ఇందులో విటమిన్ ఇ, కె లు ఉంటాయి. ఇంకా బాదం పప్పును కూడా చేర్చుకోవాలి. రాత్రి సమయంలో నానబెట్టుకున్న గుప్పెడు బాదం గింజలను తరువాత రోజు బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల శక్తి లభిస్తుంది. శరీరానికి మంచి పోషకాలు కూడా అందుతాయి.
ఏ జాగ్రత్తలు తీసుకుంటే సరి
బ్రేక్ ఫాస్ట్ లోకి ఓట్స్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓట్స్ అత్యంత బలవర్ధకమైన ఆహారాల్లో ఒకటి కావడం గమనార్హం. అందుకే మధుమేహగ్రస్తులు కూడా ఓట్స్ ను ఆహారంగా తీసుకోవడం సహజమే. ఇంకా అరటిపండును తింటే కూడా బీపీ తగ్గుతుంది. కాకపోతే ఎక్కువగా తినకూడదు. ఒకటిరెండు తింటే సరిపోతుంది. చివరగా గ్రీన్ టీ తాగితే కొవ్వు కరుగుతుంది. బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది. ఇలా ఆరోగ్యాభిలాషులు ఉదయం పూట తినే తమ అల్పాహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండొచ్చు.